Wednesday, November 7, 2018

వివాహం ఎందుకు చేసుకోలేదో చెప్పి, కన్నీరు పెట్టుకున్న గీతాసింగ్

కితకితలు చిత్రం చూసిన వారు గీతాసింగ్ ని మర్చిపోవటం కష్టమే. ఆ సినిమాతో ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ఆమె అడపాదడపా ఇవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో చేసారు కానీ ఆ స్దాయి క్యారక్టర్ పడలేదు. ఇక ఆయన చనిపోయాక..మిగతా డైరక్టర్స్ ఆమెకు క్యారక్టర్ ఇచ్చిన వాళ్లే తగ్గిపోయారు. నెలకో,సంవత్సరానికో అన్నట్లు అప్పటి నుంచి అడపాదడపా మాత్రమే ఆమె తెరపై కనిపిస్తూ వస్తున్నారు.

రీసెంట్ గా గీతా సింగ్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ పోగ్రామ్ లో మాట్లాడుతూ, తన మనసులో ఉన్న విషయాలను బయటపెట్టారు. వాటిని విన్నవారి మనసు కదిలిస్తుంది. ముఖ్యంగా వివాహం ఎందుకు చేసుకోలేదో ఆమె చెప్పిన మాటలు ఎంతటివారిని అయినా గుండె చెమ్మగిల్లేలా చేస్తాయి.

గీతా సింగ్ మాట్లాడుతూ..." మా అన్నయ్యకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆయన అర్దాంతరంగా చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఆ ఇద్దరి పిల్లలు,కుటుంబ పోషణ భారాన్ని నేనే చూస్తున్నా . ఇక వాళ్ల చదువు విషయంలో మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి సహాయం లభించింది.

నేను పెళ్లిచేసుకోవచ్చు ..కానీ నేను పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలను వదిలేయమని ఖచ్చితంగా అంటారు .. వాళ్లే నా లైఫ్ అనుకున్నాను. వాళ్ల కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. ఇలాంటి సంఘటనే నా విషయంలో జరిగితే నా పిల్లలను మా అన్నయ్య చూసుకునేవాడు. అందుకే అన్నయ్య పిల్లలను వదిలేయలేకనే నేను నా పెళ్లి గురించి ఆలోచించలేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.




ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం ...లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం...క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్‌, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం...

Please Follow:



No comments:

Post a Comment