Sunday, October 21, 2018

రేపు రైతుల ఖాతాల్లోకి 'పెట్టుబడి'


ఐదు లక్షల మంది రైతులకు రూ.500 కోట్లు
ఇప్పటికే 13 లక్షల ఖాతా నంబర్ల సేకరణ
నెలలోగా 52 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సొమ్ము

రబీ రైతుబంధు సొమ్ము పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సీజన్‌లో మొదటిదశ పెట్టుబడి సొమ్మును సోమ వారం రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ధ్రువీకరించారు. ఐదు లక్షలమంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.500 కోట్లు బదిలీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
గత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ప్రభుత్వం రూ.5,100 కోట్లు పంపిణీ చేసింది. మొత్తం 51 లక్షల మంది రైతులకు గ్రామసభల్లో పెట్టుబడి చెక్కులను అందజేసిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో చెక్కుల పంపిణీ చేయొద్దని, నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్మును అందజేయాలని ఎన్నికల కమిషన్‌ తేల్చిచెప్పడంతో బదిలీ ప్రక్రియ చేపట్టింది.
13 లక్షల బ్యాంకు ఖాతాల సేకరణ... 
రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేపనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 52 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) 13 లక్షలు సేకరించారు. వాటిని మరోసారి పరిశీలించాక ఎటువంటి అభ్యంతరాల్లేని ఖాతాలు ఐదు లక్షలు మండల వ్యవసాయ అధికారుల(ఏవో) వద్దకు చేరాయి. వాటిని ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేసింది. ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపారు. వాటిని సరిచూసుకున్న ఆర్థికశాఖ సోమవారం ఆయా బ్యాంకు ఖాతాలకు రైతుబంధు సొమ్ము బదిలీ చేయనుంది. 

నెలలోగా పూర్తి చేసే ప్రణాళిక... 
మొదటిదశలో ఐదు లక్షలమంది రైతులకు పెట్టుబడి సొమ్మును బదిలీ చేశాక, తదుపరి వారంరోజుల్లోనే మరో విడత సొమ్ము అందజేసేలా వ్యవసాయశాఖ ప్రణాళిక రచించింది. నెల రోజుల్లోగా మొత్తం 52 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము చేరనుందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాతాల సేకరణ, సొమ్ము బదిలీ పనిలో దాదాపు 2,400 మంది ఏఈవోలు నిమగ్నమయ్యారు.


ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం ...లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం...క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం... 

Please Follow:





ఉచితమని ఆశపడ్డారో అంతే సంగతులు..!

పెరుగుతున్న సైబర్‌ నేరాలు
బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం ఫోన్‌లో పంచుకోవద్దు
ఏ బ్యాంకులూ ఫోన్‌లో వివరాలు అడగవు
ఇంటర్నెట్‌ వినియోగంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి
వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లతో మరింత అప్రమత్తం
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామని భావించినా... ఒక్కోసారి సైబర్‌ నేరగాళ్ల వలలో పడి విలవిల్లాడుతుంటాం... అంతలా మాయచేసి మన వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం సంగ్రహించి దర్జాగా మోసం చేసేస్తున్నారు. ఇందుకోసం సరికొత్త సాఫ్ట్‌వేర్‌లను సైతం ప్రవేశపెట్టి మరీ దోపిడీకి తెగబడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వినియోగం ఇలా ఏదైనా ఆన్‌లైన్‌లో మోసం చేయడం సులభమైపోయింది. ఈ నేపథ్యంలో అప్రమత్తతే మనకు రక్ష. నెట్‌ వినియోగంలో జాగరూకతతో వ్యవహరించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. సైబర్‌ నేరగాళ్లు మోసాలకు ఎలా తెగబడుతున్నారు.. వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం ఎలా అనే అంశాలను తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌ అనేది ప్రస్తుతం ఒక సమాంతర వ్యవస్థగా ఏర్పడింది. నేడు ప్రతిదీ ఆన్‌లైన్‌ ద్వారా జరగడం తప్పనిసరిగా మారిపోతోంది. ఈ క్రమంలో మంచి వెనుక చెడు కూడా పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు వినూత్న పంథాలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఇటీవల సైబర్‌ నేరగాళ్ల బారిన పడి మోసపోయిన అనేక సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆన్‌లైన్‌ బ్యాకింగ్‌, సోషల్‌మీడియా, ఈ-మెయిల్‌ ..తదితర వాటి ద్వారా సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని మోసగాళ్లు తమ పని కానిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్స్‌ టార్గెట్‌గా చేసుకుని వల విసురుతున్నారు. అమాయకంగా ఒకసారి వారితో కమ్యూనికేట్‌ అయితే వారి వలలో ఇరు క్కుని డబ్బులు పోగొట్టుకోవల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. సైబర్‌ నేరగాళ్ల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం...

వైరస్‌తో స్మిష్షింగ్‌

సెల్‌ఫోన్‌ కేంద్రంగా ఇటీవల స్మిష్షింగ్‌గా పిలిచే వైరస్‌ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్‌ అని .. కొన్ని అదనపు సదుపాయాలు అంది స్తున్నామని, దీనికోసం కొంత మొత్తం చొప్పున నెలవారీ చెల్లించాలని సంక్షిప్త సందేశం వస్తుంది. సర్వీసులు కావాలంటే ఎస్‌ వద్దంటే నో నొక్కి పంపమంటుంది. ఏది నొక్కి నా సైబర్‌ నేరగాళ్లు పంపే వైరస్‌ మీ ఫోన్‌లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్‌ ద్వారా నిర్వహించే బ్యాం కింగ్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలన్నీ వారికి చేరిపోతాయి. దీంతో మీ ప్రమేయం లేకుండానే నగదు మాయమైపోతుంది.

ఉచితమని ఆశపడ్డారో

కొత్తగా యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించాం.. పరిశీలించండి. కొద్ది రోజులు ఉచితం.. ఇలాంటి ప్రకటనలు ఇంటర్నెట్‌లో ఊరిస్తుంటాయి. ఆశపడి డౌన్‌లోడ్‌ చేసుకుంటే నిండా మునిగినట్టే. ఇలా ఉచితంగా అందించే వాటి వెనుక ఓ ప్రోగ్రామిం గ్‌ ఇమిడి ఉంటుంది. దీన్ని ‘ట్రోజన్‌హార్స్‌‘ అంటారు. అంటే ఏదైనా సదుపాయాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే అందులో నిక్షిప్తమైన ఉన్న ప్రోగ్రామింగ్‌ మన కంప్యూటర్‌లో జరిగే ప్రతి లావాదేవీని సైబర్‌ నేరగాడికి అందిస్తుంది. ఇలా మన ఆర్థిక వ్యవహరాలు వారికి చేరిపోతాయి. స్మార్ట్‌ఫోన్‌లో కానీ ల్యాప్‌టాప్‌లో కానీ బ్రాండెడ్‌, పెయిడ్‌ ఇంటర్నెట్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఉప యోగించండి. సెక్యురిటీ పరంగా మంచి సాఫ్ట్‌ వేర్‌ తీసుకోవాలి. ఉచితంగా లభించేవి అంతశక్తివంతంగా పనిచేయవు.

రింగ్‌తో విష్షింగ్‌ ప్రారంభం

సాంకేతికంగా విష్షింగ్‌గా పిలిచే ప్రక్రియలో నేరం ఫోన్‌ చేయడంతో ప్రారంభమవుతుంది. రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి ఫోన్‌ ఎత్తగానే అవతలివారు మీ బ్యాంకు క్రెడిట్‌ కార్డు కంపెనీ నుంచి చేస్తున్నట్టు మాట్లాడతారు. ప్రస్తుతం ఉన్న సదుపాయాలను మరింత పెంచుతున్నామనో, అనివార్య కారణాల వల్ల మీకు అందిస్తున్న సేవల్ని నిలిపివేయాల్సి వస్తోందనో చెప్పి హడావిడి చేస్తారు. ఆపై నెమ్మదిగా కార్డు/ఖాతా నెంబరు నుంచి అన్ని వివరాలు సంగ్రహిస్తారు. ఈ వివరాల్ని కూడా మన సెల్‌ఫోన్‌ మీటలు నొక్కడం ద్వారానే ఫీడ్‌ చేయిస్తారు. ఆపై వన్‌టైమ్‌ పాస్‌వర్డు (ఓటీపీ) కూడా తీసుకుంటారు. వీటిని వినయోగించి మీఖాతాను ఖాళీ చేస్తారు.

సైబర్‌ నేరాలు అనేక రూపాలు

కంప్యూటర్‌ హ్యాకింగ్‌, పలు వైరస్‌లను డిసిమినేషన్‌, చాట్‌రూమ్స్‌ను ఆఽధారంగా చేసుకుని చేసే ఇంటర్నెట్‌ రిలే చాట్‌ (ఐఆర్‌సీ), క్రైమ్‌, లాటరీలు, వచ్చాయంటూ వ్యాపార భాగస్వామ్యులుగా మారతామంటూ, నిండా ముంచే నైజీరియన్‌ ఫ్రాడ్స్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ ఇంజనీరింగ్‌, సైబర్‌ స్టాకర్‌గా పిలిచే ఆన్‌లైన్‌ ద్వారా వేధింపులు మొదలైనవన్నీ సైబర్‌ నేరాలే.. ఎక్కువుగా అకౌంట్‌ టేకోవర్‌ అనే నేరం వేగంగా విస్తరిస్తోందని సైబర్‌క్రైమ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా సైబర్‌ నేరగాళ్లు సెల్‌ఫోన్లనూ వదలడం లేదు. సో బీకేర్‌ఫుల్‌...

ప్రొఫైల్స్‌తో జాగ్రత

ఉపాధి అవకాశాలు వెతుక్కునే వారి సౌకర్యార్థం వెబ్‌సైట్లు ప్రొఫైల్స్‌ పేరుతో సదుపాయాలందిస్తున్నాయి. ఎవరైనా తమ ఫొటోతో పాటు ఇతర వివరాలను పొందుపర్చవచ్చు. అమ్మాయి ఫొటోలు, చిరునామా, ఫోన్‌ నెంబర్లు దొరికితే కొందరు సైబర్‌ నేరగాళ్లు ద్వంద్వార్థాలతో ప్రొఫైల్స్‌ పెట్టేస్తున్నారు. దీంతో ఆ యువతికి వేధింపు ఫోన్‌కాల్స్‌ తప్పట్లే దు. మరిన్ని సందర్భాల్లో మార్ఫింగ్‌ చేసి పరువు తీస్తున్నారు. యువతులు, మహిళలు తమ ఫొటోల విషయంలో జాగ్రత్త పడాలి. ఫొటో స్టూడియోలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి.

జాగ్రత్తలు తప్పనిసరి

క్రెడిట్‌ /డెబిట్‌ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి. దుకాణ యజమానులు సైతం ఎవరైనా కార్డు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు వారి సంతకాన్ని కార్డుపై ఉన్న దాంతో సరిచూడాలి. దీనివల్ల ఇతరులు ఆ కార్డులను వినియోగించడానికి అవకాశం ఉండదు.
ప్రతి కార్డుకీ వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ (కార్డు వెరిఫికేషన్‌ వాల్యూ) నంబరు ఉంటుంది. దీన్ని గుర్తించుకుని కార్డుపై చెరిపివేయాలి.
కార్డు స్వైప్‌ చేయడానికి ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ దృష్టి ఆ ప్రక్రియపైనే ఉంచండి. దీనివల్ల స్కిమ్మింగ్‌కు అవకాశాలు తక్కువవుతాయి.
క్రెడిడ్‌ కార్డును చాలా కాలం పాటు వినియోగించకుండా ఉంటే ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపి దాని అకౌంట్‌ను తాత్కాలికంగా మూసేయండి.
ఆన్‌లైన్‌ ద్వారా వ్యవహరాలు సాగించనట్లైతే మీరు వినియోగిస్తున్న సైట్‌ అడ్రస్‌ హెచ్‌టీటీపీతో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి.
కార్డులను పోగొట్టుకున్న వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇచ్చి బ్లాక్‌ చేయించండి.
కార్డు ద్వారా లావాదేవీలు జరిగిన ప్రతిసారీ ఆ సమాచారం ఈమెయిల్‌, ఎస్‌మ్మెస్‌ ద్వారా మీకు వచ్చేలా చూసుకోండి.
ఎగ్జిబిషన్లు, సినిమాహాళ్లు షాపింగ్‌ మాల్స్‌లో ఏర్పాటుచేసే గిఫ్ట్‌ కూపన్లు, లక్కీడిప్స్‌, వోచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్‌ నెంబర్‌. ఈ-మెయిల్‌ ఐడీలను గుడ్డిగా రాయకూడదు. నిర్వాహకులు ఈ విధంగా సేకరించిన డేటాను అనేక నకలీ సంస్థలకు విక్రయిస్తున్నారు.
మార్కెటింగ్‌ సంస్థలు అనేక ఎత్తులను ప్రయోగిస్తాయి. వినియోగదారులను కలిసిన కంపెనీ ప్రతినిఽఽధులు ఎన్నో ఉపయోగాలున్నాయని చెబుతూ ఆశ పెడతారు. అయితే సొమ్ము చెల్లించిన తరువాత చేసుకునే అగ్రిమెంట్‌లో మాత్రం వీటి ప్రస్తావన ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏజెంట్లు చెప్పిన విషయాలు, అగ్రిమెంట్‌లో ఉన్న వివరాలు ఒకేలా ఉన్నాయా అన్నది సరిచూసుకోవాలి.
ఏమరుపాటు వద్దు

అందుబాటులోకి వస్తున్న ఆధునిక టెక్నాలజీని సైబర్‌ నేరగాళ్లు అందిపుచ్చుకుంటున్నారు. నగరంలో ప్రతి రోజూ కనిష్టంగా సుమారు పది మంది వీరి చేతిలో మోసపోతున్నారు. ఈ విషయాన్ని పోలీసులే చెబుతున్నారు. నయా నేరగాళ్లు కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ ఆధారంగా ప్రజలను తేలిగ్గా మాయచేస్తున్నారు. నేరం జరిగినట్టు గుర్తించేలోగా భారీ నష్టం జరిగిపోతోంది. దీనివల్ల ఎంతో మంది జీవితాలు తల్లకిందులైపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. నేరస్థులను పట్టుకున్నా జరిగిన నష్టం పూడ్చలేనంతగా ఉంటోంది. ఇక నగదు రికవరీ లాంటివి దాదాపు అసాధ్యమనే చెప్పాలి. సెల్‌ఫోన్‌ కెమెరాలు వచ్చాక వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పడిపోతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ప్రవర్తించినా రహస్య జీవితాన్ని చిత్రీకరించి నెట్‌లో పెట్టేస్తున్నారు. ఇలాచేసే వారిలో మాజీ భర్తలు, ప్రియులు ముందుంటున్నారు. రోజు రోజుకు సైబర్‌ క్రైం పోలీసుల్ని ఆశ్రయిస్తున్న బాధితుల ఉదంతాలే దీనికి నిదర్శనం. ఈ విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎంతటి పరిచయస్తుడైనా అతనికి తమ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దు..

బీమాపై బోనస్‌ పేరుతో

ఇటీవల ఇన్సూరెన్స్‌ పాలసీలపై బోనస్‌, హెర్బల్‌ సీడ్స్‌ వ్యాపారం, వడ్డీలేని రుణాల పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్‌ ఇటీవల దారుణంగా పెరిగిపోయాయి. ఆకర్షణీయంగా పలకరించే అవతలివారు మనకు సంబంధించిన కొన్ని వివరాలను ముందే చెప్పేస్తారు. దీంతో వారు ఆయా బ్యాంక్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు చెందిన వారే అని మనం ఇట్టే నమ్మేస్తాం. తమ వలలో పడిన తరువాత ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో ప్రారంభించి అందినంత దోచుకుంటారు. హెర్బల్‌ సీడ్స్‌ వ్యాపారం పేరు చెప్పే వారు ఏకంగా వాటిని విక్రయించే వ్యక్తుల్ని తామే పరిచయం చేస్తామని, తమ కంపెనీ ద్వారానే కొనిపిస్తామంటూ ఎర వేస్తుంటారు.

కీలాగర్స్‌

ప్రస్తుతం అన్ని లావాదేవీలు ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ ద్వారానే చేస్తున్నారు. ఇలా నిర్వహించే లావాదేవీలను తెలుసుకునేందుకు ‘కీ లాగర్స్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎవరైనా ఓ కంప్యూటర్‌ వినియోగించి వెళ్లిపోయాక వారు ఏమి టైప్‌ చేశారో ఈ సాఫ్ట్‌వేర్‌తో తేలికగా తెలుసుకోవచ్చు. నెట్‌ కేఫ్‌ల్లోని సిస్టమ్స్‌లో వీటిని ఏర్పాటు చేసి తరువాత ఇలా దొంగతనంగా చూస్తున్నారు. బ్యాంక్‌ లావాదేవీలు, క్రెడిట్‌ కార్డు వివరాలు ఉంటే ఎదుట వ్యక్తిని నిండా ముంచుతున్నారు.



ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం ...లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం...క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్‌, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం...

Please Follow:





యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి..!!

రష్మీ గౌతమ్.. గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తన అందచెందాలు, అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందాలతో హోయలొలికే ఈ భామ ఈ మధ్య బొద్దుగా కనిపిస్తోంది. ఎందుకిలా బొద్దుగా ఉన్నారని ఓ వీరాభిమాని అడిగిన ప్రశ్నతో ఆమె లావు కావడానికి గల కారణాలను ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. అసలు ఈ జబర్దస్త్ భామ బొద్దుగా కనిపించడానికి కారణాలేంటి..? రష్మీ బాల్యం నుంచే అరుదైన వ్యాధితో బాధపడుతోందా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల ట్విట్టర్‌లో తన అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు రష్మీ సమాధానాలిచ్చింది. ముందుగా వీరాభిమాని, రష్మీ మధ్య ట్విట్టర్‌లో జరిగిన సంభాషణ ఇరువురి మాట్లలోనే...!!
వీరాభిమాని ట్వీట్ ఇదీ...
రష్మీగారు.. ఇటీవల మిమ్మల్ని ఓ ఈవెంట్‌లో చీరలో కనిపించారు. అందులో మీరు చాలా లావుగా కనిపిస్తున్నారు. మీరు మూడు పదుల వయసున్నట్లున్నారు. కాబట్టి శరీరాకృతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వయసులో ఉన్న హీరోయిన్లు కాజల్ అగర్వాల్, సమంత, సోనాల్ చౌహాన్, ఇషా గుప్తా, చాలా స్లిమ్‌గా బాడీని మెయింటెన్ చేస్తున్నారు. మీరు కూడా కాస్త మీ బాడీపై శ్రద్ధపెట్టండి. లేకపోతే కెరీర్‌కు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. మీ కెరీర్ త్వరగా ముగిస్తే భరించలేము. నేను చెప్పే విషయాలను మీరు పరిగణనలోకి తీసుకోండి. నేను చెప్పే మాటలు మిమ్మల్ని హర్ట్ చేయవచ్చు. ఒక వేళ మీరు ఫీలయ్యింటే అందుకు నేను క్షమాపణలు చెబుతున్నానుఅని రష్మీ ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
రష్మీ రెస్పాన్స్ ఇదీ..
మీరు సూచించిన ప్రకారమే నేను ఎప్పట్నుంచే ఆహారపు అలవాట్లు, ఆహారం తీసుకునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా బరువుకు కారణం ‘రుమాటిజం’. నాకు ఈ వ్యాధి ఉందని 12ఏళ్ల వయసున్నప్పుడు తెలిసింది. దీంతో లావు విషయంలో కొన్ని హెచ్చు తగ్గులుంటాయి. ఇందుకు తగ్గ జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఒత్తిడి పెంచి, కాసింత డిప్రెషన్‌కు గురిచేస్తాయి. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి చాలా మంది తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. దుష్పరిణామాలు కనిపించాయి. నాకు అలాంటి పరిణామాలు ఎదురైతే గౌరవంగా తప్పుకుంటాను" అని రష్మీ తన అభిమానులు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.
రష్మీ రెస్పాన్స్‌ను చూసిన కొందరు నెటిజన్లు చాలా ఫీలయ్యారు. అయ్యో.. అవునా మేడం జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులు మరికొందరు సూచించారు. మీరు నిజంగానే చాలా ధైర్యవంతులు మేడం.. ఇంత బాధను దిగమింగుకుని స్క్రీన్‌పైన కనిపించి అభిమానులను అలరిస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్ టేక్ కేర్ రష్మీగారు అంటూ పలువురు వీరాభిమానులు ఆమెను మెచ్చుకున్నారు.


ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం...




Friday, October 19, 2018

మహేష్ అరవింద సమేత సినిమా మీద ఎందుకు స్పందించలేదు... కారణం అదేనా..!


మహేష్ ఎన్టీఆర్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ రావడం తో మహేష్ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఒకటై పోయారని అందరూ భావించారు. అయితే అయినప్పయిటీకి కొంత మంది అభిమానులు మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని చెప్పుకుంటున్నారు. అయితే మహేష్‌ ఈమధ్య ఏ సినిమా వచ్చినా కానీ తీరిక చేసుకుని మరీ ఆ చిత్రాన్ని చూడడమే కాకుండా దాని గురించి గొప్పగా ట్వీట్లు కూడా వేస్తున్నాడు.


దీంతో అరవింద సమేత చిత్రానికి కూడా మహేష్‌ నుంచి ట్వీట్‌ పడుతుందని తారక్‌ ఫాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసారు. ఎన్టీఆర్‌కి మహేష్‌ మంచి మిత్రుడనే సంగతి తెలిసిందే. భరత్‌ అనే నేను ఆడియో లాంఛ్‌ తారక్‌ చేతుల మీదుగానే జరిగింది. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇద్దరూ కలిసి కనిపించారు. ఎన్టీఆర్‌కి మిత్రుడైన చరణ్‌ తన వంతుగా 'అరవింద సమేత' గురించి ఫేస్‌బుక్‌లో పాజిటివ్‌గా పోస్ట్‌ చేసేసి ఫాన్స్‌ మనసులు గెలుచుకున్నాడు.


                                       
కానీ మహేష్‌ మాత్రం ఇంకా తీరిక చేసుకోలేదు. దీంతో అసలు సినిమా చూసాడా లేదా, చూస్తే నచ్చిందా లేదా అని డిస్కషన్‌ జరుగుతోంది. అరవింద సమేతపై అన్ని కార్నర్స్‌ నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోన్న నేపథ్యంలో సెలబ్రిటీ ట్వీట్స్‌ వల్ల కలక్షన్లకి మరింత ఊపొస్తుందనేది ఫాన్స్‌ ఆశ. అయితే మహేష్‌ చివరిగా అరవింద సమేత విడుదలకి ముందు రోజు ట్విట్టర్లో కనిపించాడు. రాజమౌళికి బర్త్‌డే విషెస్‌ చెప్పాక మళ్లీ ట్వీట్‌ చేయలేదు. దీంతో అభిమానుల్లో అసహనం పెరిగిపోతూ వుంది. మరోవైపు అరవింద సమేత వసూళ్లని ఫేక్‌ చేస్తున్నారంటూ మహేష్‌ అభిమానులు రచ్చ చేస్తూ వుండడం వల్ల ఈ వేడి ఇంకాస్త ఎక్కువవుతోంది. అదండీ సంగతి.





 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


బాబు రహస్య సర్వేలు ఏం చెబుతున్నాయి?

అసలు చంద్రబాబుకు సిగ్గుందా? మరీ నీచంగా కాంగ్రెస్ తో పొత్తు ఏంటి? అసలు పొత్తు లేకుండా ఎన్నికలకు రాలేడా? ఈసారి చంద్రబాబు ఓడిపోవడం ఖాయం. రహస్య సర్వేల్లో ఆరితేరిన చంద్రబాబుకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఇది. ఫలితంగా ఏపీలో కూడా కాంగ్రెస్ తో జతకట్టి ఎన్నికల బరిలో దిగుదామనుకున్న చంద్రబాబు ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ తో పొత్తు ఉండదంటూ మరోసారి టీడీపీ నుంచి లీకుల పర్వం మొదలైంది.

అంతర్గత సర్వేలు చేయించుకోవడంలో చంద్రబాబు దిట్ట. తనకు కావాల్సిన విషయానికి సంబంధించి ముందుగా లీకులు వదుల్తారు. తర్వాత దానిపై రహస్యంగా సర్వే నిర్వహించారు. ఆ వచ్చిన ఫలితాలు పాజిటివ్ గా ఉంటే అధికారిక ప్రకటన ఉంటుంది. లేదంటే ఇక ఆ టాపిక్ ను అక్కడితో వదిలేస్తారు.

కాంగ్రెస్ తో పొత్తుపై కూడా ఇలానే చేశారు చంద్రబాబు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి, కాంగ్రెస్ తో జతకట్టి బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపు ఇవ్వాలని భావించారు. తద్వారా తిరిగి తను అధికారంలోకి రావాలనే ఎత్తు వేశారు.

కానీ ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీని అప్పట్లో ఎన్టీఆర్ స్థాపించారో, ఇప్పుడు అదే పార్టీతో బాబు సంసారానికి సిద్ధపడడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందనే కోపం ఏపీ ప్రజల్లో ఇంకా ఉంది.

దీంతో కాంగ్రెస్ తో పొత్తు అంశం తనకు రివర్స్ అయ్యేలా ఉందని భావించిన బాబు వెంటనే ఆ ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తన పార్టీకి చెందిన సభ్యులతో కాంగ్రెస్ తో పొత్తు ఉండదంటూ చిన్నచిన్న ప్రకటనలు చేయిస్తున్నారు.

మరోవైపు టిక్కెట్ల కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే రహస్య సర్వేలు పూర్తిచేశారు చంద్రబాబు. తన సర్వే లెక్కల ప్రకారం, వివిధ నియోజకవర్గాల్లో టిక్కెట్లు కేటాయించాలని ఫిక్స్ అయ్యారు. తమకు ఈసారి టిక్కెట్ దక్కదని భావిస్తున్న ఎంతోమంది నేతలు ఇప్పుడు బాబు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

టిక్కెట్ ఇవ్వకపోయినా బాబు నుంచి ఏదైనా భరోసా వస్తుందని వాళ్ల ఆశ. లేకపోతే వెంటనే వైసీపీ లేదా జనసేనలోకి జంప్ అవ్వడానికి చాలామంది నేతలు రెడీగా ఉన్నారు.

ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER https://manatrips.blogspot.com/
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదం..50 మందికిపైగా మృతి

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహన వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్‌ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో రైలు రావడంతో పెను ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై నిలుచుకున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రైలు పఠాన్‌కోట్‌ నుంచి అమృత్‌సర్‌ వెళ్తోంది. ఘటన జరిగే సమయంలో రైల్వే ట్రాక్‌పై 500 నుంచి 700 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. రావణ దహనంలో భాగంగా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా రైలు వారిపై దూసుకెళ్లింది. గాయపడిన క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఎంతో సంతోషంగా దసరా వేడుకలు చేసుకుంటున్న వారు మృత్యు ఒడిలోకి జారుకోవడంతో ఆ ప్రాంతామంతా ఆర్తనాదాలతో దద్ధరిల్లింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER
https://manatrips.blogspot.com/ 

YOUTUBE 
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

సీఎం కోసం 16 ఖరీదైన కార్లు..!

 పంజాబ్‌ ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వాధికారుల కోసం భారీగా ఖర్చు పెడుతోంది. వారందరి కోసం దాదాపు 400 ఖరీదైన కార్లను కొనుగోలు చేసేందుకు పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కార్ల ధర మొత్తం సుమారు రూ.80కోట్ల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి కోసం 16 లాండ్‌ క్రూజర్‌ కార్లు కొనుగోలు చేయనున్నారు. వాటిలో రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఉంటాయి. ఇక ఆయన సిబ్బంది కోసం 13 మహీంద్రా స్కార్పియో, 14 మారుతి డిజైర్‌/ హోండా అమేజ్‌/ ఎర్టిగా కార్లను కొనుగోలు చేయనున్నారు. ఇక 17 మంది మంత్రులకు టొయోటా ఫార్చ్యునర్‌ లేదా టొయోటా క్రిస్టా కొంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని శాసనసభ్యుల కోసం 97 టొయోటా క్రిస్టా కార్లు కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మంత్రులు టొయోటా కామ్రే వాడుతుండగా, శాసనసభ్యులు టొయోటా ఇన్నోవా ఉపయోగిస్తున్నారు. రాష్ట్రం రూ.1,95,978కోట్ల లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతుంటే.. ఇప్పుడు ఇంత ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం అవసరమా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.


ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER
https://manatrips.blogspot.com/ 


YOUTUBE 
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw