పెరుగుతున్న సైబర్ నేరాలు
బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం ఫోన్‌లో పంచుకోవద్దు
ఏ బ్యాంకులూ ఫోన్‌లో వివరాలు అడగవు
ఇంటర్నెట్ వినియోగంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి
వైరస్ సాఫ్ట్‌వేర్‌లతో మరింత అప్రమత్తం
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామని భావించినా... ఒక్కోసారి సైబర్ నేరగాళ్ల వలలో పడి విలవిల్లాడుతుంటాం... అంతలా మాయచేసి మన వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం సంగ్రహించి దర్జాగా మోసం చేసేస్తున్నారు. ఇందుకోసం సరికొత్త సాఫ్ట్‌వేర్‌లను సైతం ప్రవేశపెట్టి మరీ దోపిడీకి తెగబడుతున్నారు. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగం ఇలా ఏదైనా ఆన్‌లైన్‌లో మోసం చేయడం సులభమైపోయింది. ఈ నేపథ్యంలో అప్రమత్తతే మనకు రక్ష. నెట్ వినియోగంలో జాగరూకతతో వ్యవహరించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. సైబర్ నేరగాళ్లు మోసాలకు ఎలా తెగబడుతున్నారు.. వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం ఎలా అనే అంశాలను తెలుసుకుందాం.
ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం ఒక సమాంతర వ్యవస్థగా ఏర్పడింది. నేడు ప్రతిదీ ఆన్‌లైన్ ద్వారా జరగడం తప్పనిసరిగా మారిపోతోంది. ఈ క్రమంలో మంచి వెనుక చెడు కూడా పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు వినూత్న పంథాలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయిన అనేక సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆన్‌లైన్ బ్యాకింగ్, సోషల్‌మీడియా, ఈ-మెయిల్ ..తదితర వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని మోసగాళ్లు తమ పని కానిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్స్ టార్గెట్‌గా చేసుకుని వల విసురుతున్నారు. అమాయకంగా ఒకసారి వారితో కమ్యూనికేట్ అయితే వారి వలలో ఇరు క్కుని డబ్బులు పోగొట్టుకోవల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. సైబర్ నేరగాళ్ల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం...
వైరస్‌తో స్మిష్షింగ్
సెల్‌ఫోన్ కేంద్రంగా ఇటీవల స్మిష్షింగ్‌గా పిలిచే వైరస్ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్ అని .. కొన్ని అదనపు సదుపాయాలు అంది స్తున్నామని, దీనికోసం కొంత మొత్తం చొప్పున నెలవారీ చెల్లించాలని సంక్షిప్త సందేశం వస్తుంది. సర్వీసులు కావాలంటే ఎస్ వద్దంటే నో నొక్కి పంపమంటుంది. ఏది నొక్కి నా సైబర్ నేరగాళ్లు పంపే వైరస్ మీ ఫోన్‌లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్ ద్వారా నిర్వహించే బ్యాం కింగ్, క్రెడిట్ కార్డు లావాదేవీలన్నీ వారికి చేరిపోతాయి. దీంతో మీ ప్రమేయం లేకుండానే నగదు మాయమైపోతుంది.
ఉచితమని ఆశపడ్డారో
కొత్తగా యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ రూపొందించాం.. పరిశీలించండి. కొద్ది రోజులు ఉచితం.. ఇలాంటి ప్రకటనలు ఇంటర్నెట్‌లో ఊరిస్తుంటాయి. ఆశపడి డౌన్‌లోడ్ చేసుకుంటే నిండా మునిగినట్టే. ఇలా ఉచితంగా అందించే వాటి వెనుక ఓ ప్రోగ్రామిం గ్ ఇమిడి ఉంటుంది. దీన్ని ‘ట్రోజన్‌హార్స్‘ అంటారు. అంటే ఏదైనా సదుపాయాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో నిక్షిప్తమైన ఉన్న ప్రోగ్రామింగ్ మన కంప్యూటర్‌లో జరిగే ప్రతి లావాదేవీని సైబర్ నేరగాడికి అందిస్తుంది. ఇలా మన ఆర్థిక వ్యవహరాలు వారికి చేరిపోతాయి. స్మార్ట్‌ఫోన్‌లో కానీ ల్యాప్‌టాప్‌లో కానీ బ్రాండెడ్, పెయిడ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఉప యోగించండి. సెక్యురిటీ పరంగా మంచి సాఫ్ట్ వేర్ తీసుకోవాలి. ఉచితంగా లభించేవి అంతశక్తివంతంగా పనిచేయవు.
రింగ్‌తో విష్షింగ్ ప్రారంభం
సాంకేతికంగా విష్షింగ్‌గా పిలిచే ప్రక్రియలో నేరం ఫోన్ చేయడంతో ప్రారంభమవుతుంది. రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఫోన్ ఎత్తగానే అవతలివారు మీ బ్యాంకు క్రెడిట్ కార్డు కంపెనీ నుంచి చేస్తున్నట్టు మాట్లాడతారు. ప్రస్తుతం ఉన్న సదుపాయాలను మరింత పెంచుతున్నామనో, అనివార్య కారణాల వల్ల మీకు అందిస్తున్న సేవల్ని నిలిపివేయాల్సి వస్తోందనో చెప్పి హడావిడి చేస్తారు. ఆపై నెమ్మదిగా కార్డు/ఖాతా నెంబరు నుంచి అన్ని వివరాలు సంగ్రహిస్తారు. ఈ వివరాల్ని కూడా మన సెల్‌ఫోన్ మీటలు నొక్కడం ద్వారానే ఫీడ్ చేయిస్తారు. ఆపై వన్‌టైమ్ పాస్‌వర్డు (ఓటీపీ) కూడా తీసుకుంటారు. వీటిని వినయోగించి మీఖాతాను ఖాళీ చేస్తారు.
సైబర్ నేరాలు అనేక రూపాలు
కంప్యూటర్ హ్యాకింగ్, పలు వైరస్‌లను డిసిమినేషన్, చాట్‌రూమ్స్‌ను ఆఽధారంగా చేసుకుని చేసే ఇంటర్నెట్ రిలే చాట్ (ఐఆర్‌సీ), క్రైమ్, లాటరీలు, వచ్చాయంటూ వ్యాపార భాగస్వామ్యులుగా మారతామంటూ, నిండా ముంచే నైజీరియన్ ఫ్రాడ్స్, ఫేస్‌బుక్ వంటి సోషల్ ఇంజనీరింగ్, సైబర్ స్టాకర్‌గా పిలిచే ఆన్‌లైన్ ద్వారా వేధింపులు మొదలైనవన్నీ సైబర్ నేరాలే.. ఎక్కువుగా అకౌంట్ టేకోవర్ అనే నేరం వేగంగా విస్తరిస్తోందని సైబర్‌క్రైమ్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు సెల్‌ఫోన్లనూ వదలడం లేదు. సో బీకేర్‌ఫుల్...
ప్రొఫైల్స్‌తో జాగ్రత
ఉపాధి అవకాశాలు వెతుక్కునే వారి సౌకర్యార్థం వెబ్‌సైట్లు ప్రొఫైల్స్ పేరుతో సదుపాయాలందిస్తున్నాయి. ఎవరైనా తమ ఫొటోతో పాటు ఇతర వివరాలను పొందుపర్చవచ్చు. అమ్మాయి ఫొటోలు, చిరునామా, ఫోన్ నెంబర్లు దొరికితే కొందరు సైబర్ నేరగాళ్లు ద్వంద్వార్థాలతో ప్రొఫైల్స్ పెట్టేస్తున్నారు. దీంతో ఆ యువతికి వేధింపు ఫోన్‌కాల్స్ తప్పట్లే దు. మరిన్ని సందర్భాల్లో మార్ఫింగ్ చేసి పరువు తీస్తున్నారు. యువతులు, మహిళలు తమ ఫొటోల విషయంలో జాగ్రత్త పడాలి. ఫొటో స్టూడియోలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి.
జాగ్రత్తలు తప్పనిసరి
క్రెడిట్ /డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి. దుకాణ యజమానులు సైతం ఎవరైనా కార్డు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు వారి సంతకాన్ని కార్డుపై ఉన్న దాంతో సరిచూడాలి. దీనివల్ల ఇతరులు ఆ కార్డులను వినియోగించడానికి అవకాశం ఉండదు.
ప్రతి కార్డుకీ వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ (కార్డు వెరిఫికేషన్ వాల్యూ) నంబరు ఉంటుంది. దీన్ని గుర్తించుకుని కార్డుపై చెరిపివేయాలి.
కార్డు స్వైప్ చేయడానికి ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ దృష్టి ఆ ప్రక్రియపైనే ఉంచండి. దీనివల్ల స్కిమ్మింగ్‌కు అవకాశాలు తక్కువవుతాయి.
క్రెడిడ్ కార్డును చాలా కాలం పాటు వినియోగించకుండా ఉంటే ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపి దాని అకౌంట్‌ను తాత్కాలికంగా మూసేయండి.
ఆన్‌లైన్ ద్వారా వ్యవహరాలు సాగించనట్లైతే మీరు వినియోగిస్తున్న సైట్ అడ్రస్ హెచ్‌టీటీపీతో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి.
కార్డులను పోగొట్టుకున్న వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించండి.
కార్డు ద్వారా లావాదేవీలు జరిగిన ప్రతిసారీ ఆ సమాచారం ఈమెయిల్, ఎస్‌మ్మెస్ ద్వారా మీకు వచ్చేలా చూసుకోండి.
ఎగ్జిబిషన్లు, సినిమాహాళ్లు షాపింగ్ మాల్స్‌లో ఏర్పాటుచేసే గిఫ్ట్ కూపన్లు, లక్కీడిప్స్, వోచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్ నెంబర్. ఈ-మెయిల్ ఐడీలను గుడ్డిగా రాయకూడదు. నిర్వాహకులు ఈ విధంగా సేకరించిన డేటాను అనేక నకలీ సంస్థలకు విక్రయిస్తున్నారు.
మార్కెటింగ్ సంస్థలు అనేక ఎత్తులను ప్రయోగిస్తాయి. వినియోగదారులను కలిసిన కంపెనీ ప్రతినిఽఽధులు ఎన్నో ఉపయోగాలున్నాయని చెబుతూ ఆశ పెడతారు. అయితే సొమ్ము చెల్లించిన తరువాత చేసుకునే అగ్రిమెంట్‌లో మాత్రం వీటి ప్రస్తావన ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏజెంట్లు చెప్పిన విషయాలు, అగ్రిమెంట్‌లో ఉన్న వివరాలు ఒకేలా ఉన్నాయా అన్నది సరిచూసుకోవాలి.
ఏమరుపాటు వద్దు
అందుబాటులోకి వస్తున్న ఆధునిక టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు అందిపుచ్చుకుంటున్నారు. నగరంలో ప్రతి రోజూ కనిష్టంగా సుమారు పది మంది వీరి చేతిలో మోసపోతున్నారు. ఈ విషయాన్ని పోలీసులే చెబుతున్నారు. నయా నేరగాళ్లు కంప్యూటర్, సెల్‌ఫోన్ ఆధారంగా ప్రజలను తేలిగ్గా మాయచేస్తున్నారు. నేరం జరిగినట్టు గుర్తించేలోగా భారీ నష్టం జరిగిపోతోంది. దీనివల్ల ఎంతో మంది జీవితాలు తల్లకిందులైపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. నేరస్థులను పట్టుకున్నా జరిగిన నష్టం పూడ్చలేనంతగా ఉంటోంది. ఇక నగదు రికవరీ లాంటివి దాదాపు అసాధ్యమనే చెప్పాలి. సెల్‌ఫోన్ కెమెరాలు వచ్చాక వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పడిపోతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ప్రవర్తించినా రహస్య జీవితాన్ని చిత్రీకరించి నెట్‌లో పెట్టేస్తున్నారు. ఇలాచేసే వారిలో మాజీ భర్తలు, ప్రియులు ముందుంటున్నారు. రోజు రోజుకు సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయిస్తున్న బాధితుల ఉదంతాలే దీనికి నిదర్శనం. ఈ విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎంతటి పరిచయస్తుడైనా అతనికి తమ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దు..
బీమాపై బోనస్ పేరుతో
ఇటీవల ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్, హెర్బల్ సీడ్స్ వ్యాపారం, వడ్డీలేని రుణాల పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్ ఇటీవల దారుణంగా పెరిగిపోయాయి. ఆకర్షణీయంగా పలకరించే అవతలివారు మనకు సంబంధించిన కొన్ని వివరాలను ముందే చెప్పేస్తారు. దీంతో వారు ఆయా బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన వారే అని మనం ఇట్టే నమ్మేస్తాం. తమ వలలో పడిన తరువాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ప్రారంభించి అందినంత దోచుకుంటారు. హెర్బల్ సీడ్స్ వ్యాపారం పేరు చెప్పే వారు ఏకంగా వాటిని విక్రయించే వ్యక్తుల్ని తామే పరిచయం చేస్తామని, తమ కంపెనీ ద్వారానే కొనిపిస్తామంటూ ఎర వేస్తుంటారు.
కీలాగర్స్
ప్రస్తుతం అన్ని లావాదేవీలు ఇంటర్నెట్, కంప్యూటర్ ద్వారానే చేస్తున్నారు. ఇలా నిర్వహించే లావాదేవీలను తెలుసుకునేందుకు ‘కీ లాగర్స్’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎవరైనా ఓ కంప్యూటర్ వినియోగించి వెళ్లిపోయాక వారు ఏమి టైప్ చేశారో ఈ సాఫ్ట్‌వేర్‌తో తేలికగా తెలుసుకోవచ్చు. నెట్ కేఫ్‌ల్లోని సిస్టమ్స్‌లో వీటిని ఏర్పాటు చేసి తరువాత ఇలా దొంగతనంగా చూస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలు, క్రెడిట్ కార్డు వివరాలు ఉంటే ఎదుట వ్యక్తిని నిండా ముంచుతున్నారు.

ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం ...లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం...క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం...
Please Follow:
No comments:
Post a Comment