Wednesday, October 17, 2018

శుభవార్త డ్రైవింగ్ లైసెన్స్ లో భారీ మార్పులు ఏంటో మీరే చూడండి.

మీకు కారు కానీ బైక్ కాని ఉందా? అయితే మీకు ఒక శుభవార్త. ఉద్యోగాల రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యే ఉద్యోగులు, వాహన డ్రైవర్ల ట్రాఫిక్ వేతనాల భారం ఇక తీరనున్నాయి. దేశవ్యాప్తంగా 2019, జూలై నుంచి ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సరికొత్త డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీ) జారీచేయనున్నారు. కొత్తగా జారీచేసే స్మార్ట్ కార్డులపై మైక్రోచిప్, క్యూఆర్ కోడ్‌లను ముద్రించనున్నారు. కార్డు వివరాల్ని వేగంగా గుర్తించడానికి వీటిలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు.

యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్
అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే సెక్యూరిటీ ఫీచర్లతో ఈ సరికొత్త డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు ప్రవేశపెట్టనున్నారు. ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ పేరుతో దీన్ని జారీ చేస్తారు. వాహన డ్రైవర్ పేరు, బ్లడ్ గ్రూప్, అవయవదానం చేస్తామంటూ ఇచ్చే డిక్లరేషన్ వివరాల్ని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌పై పొందుపరుస్తారు.


వివరాల్ని కార్డుపై
ఒకవేళ దివ్యాంగులైతే వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాహనం ఉంటే ఆ వివరాల్ని కార్డుపై ముద్రిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 32వేల కొత్త డ్రైవింగ్ లైసెన్సులు(నెలకు సుమారు 9.6 లక్షలు) జారీ లేదా రెన్యువల్ చేస్తున్నారు.


రవాణాశాఖ
అలాగే నిత్యం 43వేల వాహనాలు(నెలకు సుమారు 13 లక్షలు) కొత్తగా రిజిస్టర్ లేదంటే రీ-రిజిస్టర్ అవుతున్నాయి. వీరందరికీ కొత్తగా ప్రవేశపెట్టే లైసెన్సులు, ఆర్సీలను రవాణాశాఖ జారీచేయనున్నది. ఈ స్మార్ట్ కార్డుల ప్రక్రియ నిరంతరం సాగుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రారంభించింది.


ఆర్సీలో
ఈ కొత్త కార్డుల ధర 15 నుంచి 20 రూపాయలకు మించకపోవచ్చు . వాహనం కాలుష్య నియంత్రణ పరీక్షను రెగ్యూలర్‌గా చేయిస్తున్నారా? లేదా? అని తెలిపే ఫీచర్‌ను సైతం ఆర్సీలో పొందుపర్చారు తద్వారా వాహనం బీఎస్-4/బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదా? లేదా? అనే విషయం తెలిసిపోతుంది.


సంపూర్ణ సమాచారాన్ని
ఇప్పటివరకూ వాహనానికి సంబంధించిన కాలుష్య పరీక్షల గురించి యజమానిని అడగాల్సి వచ్చేది. కొత్త స్మార్ట్ కార్డులతో ఇక అవసరం ఉండదు. ప్రతీ అంశం ఇందులో నమోదవుతుంది. లైసెన్సు, ఆర్సీ స్మార్ట్ కార్డుల జారీ ద్వారా వాహనాలు, డ్రైవర్లకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు


కేంద్రం

తాజా స్మార్ట్ కార్డుల ద్వారా కేంద్రం నిర్వహణలోని సెంట్రల్ డాటాబేస్‌లో వాహన్(వాహనాలు), సారథి(డ్రైవర్ల)కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిల్వ చేయవచ్చు.


ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER https://manatrips.blogspot.com/ 
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw


No comments:

Post a Comment