Tuesday, October 16, 2018

మీ ఆధార్ కార్డు ఇప్పటివరకు ఎక్కడేక్కడ వాడబడిందో తెలుసుకోండిలా!

ప్రస్తుతం సంక్షోభంలో వున్న ఆధార్ సెక్యురిటి కారణంగా, ప్రతి ఒక్కరికి తమ ఆధార్ కార్డు ఏవిధమైన దుర్వినియోగానికి వాడబడిందా అనే అనుమానం వస్తుంది. అయితే, ఇప్పటి వరకు మీ ఆధార్ కార్డు ఏవిధమైన అవసరాలకి వాడబడిందో తెలుసుకోవడం ఇపుడు సులభం. ఇక్కడ మేము అందించిన విధానంతో మీ ఆధార్ కార్డు వివరాలను తెలుసుకోండి.

* ముందుగా ప్రభుత్వ అధికారిక UIDAI యొక్క లింక్ ఓపెన్ చేయాలి.

* పేజ్ ఓపెన్ అయిన తరువాత సూచించిన దగ్గర మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి మరియు అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ కూడా నమోదు చేసి ఎంటర్ చేయాలి.

* ఈ విధంగా చేసినతరువాత మీకు మీ యొక్క నమోదుకాబడిన (Registered) మొబైల్ నంబర్ కి OTP వస్తుంది. ఈ OTP కేవలం ముందుగా నమోదు చేయబడిన మొబైల్ నంబర్కు మాత్రమే వస్తుంది.

* మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేసిన తరువాత మీరు ఆధార్ పేజీ వివరాల్లోకి వెళతారు, ఇక్కడ మీరు మీకు సంబంధించిన వివరాలను చూడొచ్చు. అయితే ఇక్కడ మీరు ఏయే వివరాలు కావాలనుకుంటున్నారో వాటిని మీరు ఎంచుకోవలసి ఉంటుంది. ఉదాహరణకి డేట్ ఎంచుకోవడం ద్వారా ఈ డేట్ పరిధిలో ఏవిధమైన సౌకర్యాలకు ఈ కార్డు వాడంబడిదో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎవరు వాడారన్న విషయం మాత్రం తెలుసుకునే వీలులేదు.

గమనిక : సెక్యూరిటీ కారణంగా, ఈ వెబ్సైట్ కొన్నిసార్లు ఓపెన్ కాకపోవచ్చు.




 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER https://manatrips.blogspot.com/ 
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment