- 60-70 మందితో నటించినా ఎవ్వరూ ఇలా అనలేదు : అర్జున్
తనను యాక్షన్ కింగ్ అర్జున్ లైంగికంగా వేధించాడని మలయాళ నటి శ్రుతి హరిహరన్ పేర్కొన్నారు. 2016లో జిగరబాజ్ సినిమా సమయంలో తనను గట్టిగా కౌగలించుకోవడానికి ప్రయత్నించేవాడని పేర్కొంది. ఇతనే కాకుండా చాలా మంది తనను లైంగికంగా వేధించారని చెబుతూ అందులో అర్జున్ పేరును, సినిమా సంఘటనను ప్రస్తావించింది. దీనికి సంబంధించి రెండు పేజీల లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ''అర్జున్, నేను జోడీగా నటిస్తోన్న ద్విభాషా చిత్రం షూటింగ్ జగురుతోంది. అతని సినిమాలు చూస్తూ పెరిగాను. అతనితో కలిసి నటించే అవకాశం రావడంతో ఎంతో ఎగ్జైట్ అయ్యాను. షూటింగ్‌లో మొదట కొన్ని రోజులు సాధారణంగా ఉంది. ఆ చిత్రంలో నేను అతని భార్యగా నటిస్తున్నా. ఆ రోజు నేను, అతను కలసి ఓ రొమాంటిక్ సన్నివేశంలో చేస్తున్నాం. చిన్న డైలాగ్ తర్వాత ఇద్దరం గట్టిగా కౌగలించుకునే సన్నివేశం అది. ఆ సన్నివేశం రిహార్సల్స్ సమయంలో మేము మాటలు అడుతుండగానే అర్జున్ నన్ను కౌగిలించుకున్నారు. నన్ను ఇంకా గట్టిగా కౌగలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ముందుగా చెప్పనూ లేదు. అలా చేయమని అనుమతీ లేదు. ఆ సమయంలో ఆ చిత్ర డైరెక్టర్ చెబుతూ 'ఈ పని సన్నివేశం చేస్తున్నప్పుడు చేయాలి' అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయా. అతని ఆలోచన సీన్ చేయడంలో కాకుండా మరేదో ఉండేది'' అని పేర్కొంది. నిజంగా తానో అదృష్టవంతురాలినని, శారీరకంగా, మానసికంగా ఇలాంటి మచ్చలు తెచ్చే సంఘటనల నుంచి తాను తప్పించుకున్నానని పేర్కొంది శ్రుతి.
ఎవ్వరి నుంచీ ఇలాంటి మాటలు రాలేదు : అర్జున్
శ్రుతి ఆరోపణల నేపథ్యంలో అర్జున్ స్పందించారు. 'నేను చాలా దశాబ్దాల కాలం నుంచి చిత్రసీమలో ఉంటున్నా. ఈ సమయంలో 60-70 మంది వరకూ నటీమణులతో నటించాను. కానీ ఒక్కరి నుంచీ ఇటువంటి ఫిర్యాదు రాలేదు. నాతో పని చేసేవారిని గౌరవిస్తాను. డేట్ టు డేట్ వారితో టచ్‌లో ఉంటా'' అని న్యూస్9తో మాట్లాడుతూ అన్నారు.

No comments:
Post a Comment