Thursday, October 18, 2018

ఫస్ట్ లుక్: కథనం రంగమ్మత్త కదనం

బుల్లితెర ప్రేక్షకులను ఎన్నాళ్ళుగానో అలరిస్తూ భారీ పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ నెమ్మదిగా వెండితెర మీద కూడా తన సత్తా చాటింది.  'క్షణం' సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి అందరిని మెప్పించిన అనసూయ 'రంగస్థలం' లో రంగమ్మత్తగా తెలుగువాళ్ళ హృదయాలను గెలుచుకుంది. చరణ్ కు చిట్టిబాబుగా ఎంత పేరు వచ్చిందో అనసూయకు రంగమ్మత్త పాత్రకు కూడా అంతే పేరు వచ్చింది.

తాజాగా అనసూయ 'కథనం' అనే థ్రిల్లర్ తో మరో సారి ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది.  ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విజయదశమి సందర్భంగా ఈరోజే రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో అనసూయ ఏదో సీరియస్ గా రాస్తూ ఉంది. మరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తోందో లేదా ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ స్టొరీ ని రాస్తోందో తెలియదు గానీ బ్యాక్  గ్రౌండ్ స్కోర్ మాత్రం పక్కాగా ఒక థ్రిల్లర్ స్టైల్ లోనే ఉంది. 

ఇక 'కదనం' టైటిల్ మొదట వచ్చి.. తర్వాత ద పొట్టలో చుక్క కింద వత్తు ఒక పెన్ లాగా వస్తాయి.  కదనం అంటే యుద్ధం. కథనం అంటే స్క్రీన్ ప్లే.  అంటే ఒక భారీ పోరాటానికి రంగమ్మత్త కథనం సిద్దం చేస్తోందన్నమాట!

ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్.. ధనరాజ్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ నాదెండ్ల ఈ సినిమాకు దర్శకుడు. మీరు కూడా ఈ మోషన్ పోస్టర్ పై ఒక లుక్కేయండి. 


https://youtu.be/aYts4XFf84c


లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.
BLOGGER
https://manatrips.blogspot.com/ 


YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw


No comments:

Post a Comment