Saturday, October 6, 2018

ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్లకు చంద్రబాబు దసరా కనుక...అలాగే కొన్ని పథకాలు!

ఏపీలోని రేషన్ డీలర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా గుడ్ న్యూస్ వినిపించింది. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రంలోని రేషన్‌ డీలర్లకు గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న బకాయిలను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం

రాష్ట్రంలో 2015 నవంబరు నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం అమలవుతున్నప్పటికీ.. 2016 సెప్టెంబరు వరకు గతంలో ఇచ్చిన పాత పద్ధతి ప్రకారమే క్వింటాలుకు రూ.20 కమీషన్‌నే ప్రభుత్వం డీలర్లకు ఇచ్చింది. అయితే, వాస్తవానికి జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం క్వింటాకు రూ.70 కమీషన్‌ ఇవ్వాల్సి ఉంది. ఇదే విషయమై తమకు రావాల్సి ఉన్న బకాయిలను విడుదల చేయాల్సిందిగా కోరుతూ గతంలో పలు సందర్భాల్లో రేషన్ డీలర్లు ఢిల్లీ స్థాయిలో ధర్నాలు చేపట్టారు.

రేషన్ డీలర్ల

రేషన్ డీలర్ల ఆందోళనలపై స్పందించిన కేంద్ర కార్యదర్శి ఇటీవల చట్టం ప్రకారం డీలర్లకు ఇవ్వాల్సి ఉన్న కమీషన్‌‌ని విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే తాజాగా ఏపీ సర్కార్ రేషన్ డీలర్లకు అందాల్సి ఉన్న బకాయిల కోసం రూ.30.14 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలుస్తోంది.

మరి కొన్ని పథకాలు

తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా శక్తి సంఘాల సభ్యులకి పసుపు-కుంకుమ పేరుతో విడతలుగా వారి అకౌంట్ లో నగదు జమ చేసింది. డేటా నమోదులో దొర్లిన తప్పులు సాఫ్ట్ వేర్ సమస్యలు వల్ల చాలామందికి ఈ నిధులు అందలేదు. తమ గ్రూప్లలో కొందరికి నగదు అంది తమకి అందలేదు అని లోలోపల మదన పడుతున్నారు.

నిరుద్యోగ భృతి

ఇక ఇది ఇలాగ ఉంటే తమ్ముళ్ల కోసం అండగా ఉంటా అంటూ నిరుద్యోగ భృతి పధకాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు. ఈ పథకాని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. నిజమైన నిరుద్యోగికి ఒక రూపాయి అందిన దాఖలాలు లేవు.ఇంకేముంది ఇది కూడా ఒక ఓటు పధకం అని అందరికి అర్థమైంది. ఎప్పుడో జరిగే పండగకోసం ఇప్పుడే ఇల్లు చక్కపెడుతన్నారు అని అందరికి అనిపిస్తోంది.

టీడీపీ ఎన్నికల

ఏదిఏమైనా ఎన్నికలు దగ్గరకి వస్తున్నాయి అని ఏదో హడావిడి చేస్తున్నారు తప్ప ఇందులో ఏమి విశేషం లేదు అని అంటున్నారు చాలామంది. నిజానికి ప్రతి నిరుద్యోగికి రావలసింది రూ.2000 అది అప్పుడు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. బాబు వస్తే జాబ్ రాణి పక్షాన ఈ పధకాన్ని తెస్తాము అని చెప్పారు.

లోకేష్

కానీ ఏది అప్పటినుంచి నోచుకోలేదు. అయితే ఇప్పుడు యువ నేస్తం అని పేరిట ఈ పధకాన్ని అమలు చేసారు చంద్రబాబు నాయుడు మరియు అయన కొడుకు లోకేష్ బాబు.

యువతకి

ఏదిఏమైనా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వరాల మీద వరాలు ఇచ్చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తుండడంతో ఇలా చేస్తున్నారు అని కొందరి మాట. ఎలాగైనా యువతకి కావలసింది నెలకి రూ.1000 కాదు వారికీ ఒక దారి చూపే ఒక ఉద్యోగం అది మనం అంత తెలుసుకోవాలి.

No comments:

Post a Comment