జబర్దస్త్ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులను, వారి కుటుంబ సభ్యులను, మహిళలను అవమానపరిచే విధంగా ఇటీవల ఓ కామెడీ స్కిట్ ప్రసారం కావడంతో జగిత్యాల వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఈ షోను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ గల్ఫ్, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా గల్ఫ్ కుటుంబాలను అవమానిస్తూ స్కిట్ చేసిన కమెడియన్లు అవినాష్, కార్తీక్ దిష్టిబొమ్మలను ఆందోళన కారులు దహనం చేశారు. అనంతరం జగిత్యాల టౌన్ సీఐ ప్రకాశ్‌కు ఫిర్యాదు షోపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా గల్ఫ్ కుటుంబాలను అవమానిస్తూ స్కిట్ చేసిన కమెడియన్లు అవినాష్, కార్తీక్ దిష్టిబొమ్మలను ఆందోళన కారులు దహనం చేశారు. అనంతరం జగిత్యాల టౌన్ సీఐ ప్రకాశ్‌కు ఫిర్యాదు షోపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
నాగబాబు, రోజా, రష్మిపై గల్ప్ కుటుంబాల ఫైర్
తెలంగాణ గల్ఫ్, కార్మిక కుటుంబాలు జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాలపై, యాంకర్ రష్మిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను అవమానిస్తూ నీచమైన స్కిట్లు చేస్తున్న వారిని ప్రోత్సహించడంపై మండిపడ్డారు.
ఇంతకీ స్కిట్‌లో ఏంది?
ఈ స్కిట్‌లో కొడుకును తిట్టే ఒక తల్లి వేశంలో అవినాష్ కనిపించాడు. కొడుకు రాజు పాత్రలో కార్తీక్ నటించాడు. ‘‘పక్కింటి సురేశ్ భార్యను వదలి గల్ఫ్ వెళ్లి పని చేసుకుంటున్నాడని, నువ్వు పడుకుని నిద్రపోతున్నావు' అంటూ ఆ తల్లి కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో కొడుకు పాత్రదారి కార్తీక్ ‘వాడు జాబ్ చూసుకుంటున్నాడు, వాడి పెళ్లాన్ని నేను చూసుకుంటున్నాను..' అంటూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
ఆ వీడియో తొలగింపు
జగిత్యాల ప్రాంతం బోర్డు పెట్టిమరీ ఈ స్కిట్ చేయడం వివాదాస్పదం అయింది. ఈ స్కిట్ మీద నిరసనలు వ్యక్తం కావడంతో యూట్యూబ్ నుండి నిర్వాహకులు ఆ వీడియో తొలగించారు.
సోషల్ మీడియాలో ఆగ్రహం
మరో వైపు ఈ స్కిట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రాంత ప్రజలు, పొట్టకూటి కోసం గల్ప్ వలస వెళ్లిన వారి కుటుంబాలు, జగిత్యాల ప్రాంత ప్రజలు సోషల్ మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
No comments:
Post a Comment