బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. నటీమణులని లైంగికంగా వేధించిన వారి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నానా పాటేకర్, షాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, వికాస్ బహల్ వంటి దర్శకులపై హీరోయిన్లు తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వికాస్ బహల్, షాజిద్ వంటి దర్శకులపై చాలా మంది హీరోయిన్లు ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది నటీమణులని నగ్నంగా చూడడానికి ప్రయత్నించాడని షాజిద్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ సిమ్రాన్ సూరి అతడిపై సంచలన ఆరోపణలు చేసింది.
ఆడిషన్స్ కోసం పిలిచి
షాజిద్ ఖాన్ ఓ రోజు తనని ఆడిషన్స్ కోసం ఇంటికి పిలిచాడు. ఇంటికి వెళితే అతడు త్రెడ్ మిల్ పైషర్ట్ లేకుండా ఉన్నాడు. నా బాడీ చాలా బావుంది కదూ.. అంటూ వెకిలిగా మాట్లాడాడు. ప్రొఫెషనల్ మీటింగ్ కు అని పిచ్చి వింతగా ప్రవర్తించాడు.
బలవంతగా బట్టలు విప్పడానికి
నా వద్దకు వచ్చి బలవంతంగా బట్టలు విప్పడానికి ప్రయత్నించాడు. నేను డైరెక్టర్ ని. కాబట్టి నీ బాడీ చూడాలి అంటూ అసభ్యంగా మాట్లాడాడు. నేను షాక్ కి గురయ్యా. అతడినుంచి తప్పుంచుకుందామని ప్రయత్నించా. అయినా కూడా నన్ను నగ్నంగా చూడాలి అంటూ మీద పడ్డాడు.
వాళ్ళ అమ్మని పక్క గదిలో పెట్టుకుని
ఈ కీచక పర్వం మొత్తం అతడి తల్లి పక్క గదిలో ఉండగానే జరిగిందని సిమ్రాన్ సూరి తెలిపింది. గట్టిగా అరవకు.. మా అమ్మ పక్క గదిలోనే ఉంది అని చెప్పాడు. అతడి నుంచి తప్పించుకుని తాను పారిపోయానని సిమ్రన్ సూరి తెలిపింది. ఆ తరువాత అతడి ఫోన్ నంబర్ కూడా డిలీట్ చేశానని తెలిపింది.
షాజిద్ ఖాన్ పై ఇది నాలుగవ ఆరోపణ. ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలని నగ్నంగా చూడాలనుకునే నీచమైన బుద్ది అతడిది అంటూ ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు ఆరోపణలు చేశారు. ఒకే దర్శకుడుపై ఇంతమంది హీరోయిన్లు ఆరోపణలు చేయడంతో షాజిద్ కు తీవ్రమైన చిక్కులు తప్పవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER https://manatrips.blogspot.com/
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
No comments:
Post a Comment