అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహన వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో రైలు రావడంతో పెను ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై నిలుచుకున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రైలు పఠాన్‌కోట్ నుంచి అమృత్‌సర్ వెళ్తోంది. ఘటన జరిగే సమయంలో రైల్వే ట్రాక్‌పై 500 నుంచి 700 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. రావణ దహనంలో భాగంగా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా రైలు వారిపై దూసుకెళ్లింది. గాయపడిన క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఎంతో సంతోషంగా దసరా వేడుకలు చేసుకుంటున్న వారు మృత్యు ఒడిలోకి జారుకోవడంతో ఆ ప్రాంతామంతా ఆర్తనాదాలతో దద్ధరిల్లింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER
https://manatrips.blogspot.com/
YOUTUBE
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER
https://manatrips.blogspot.com/
YOUTUBE
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
No comments:
Post a Comment