Saturday, October 6, 2018

ఈ నెల 16న లెనోవో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల




లెనోవో భారత్‌లో తన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసి ఏడాది కావస్తున్నది. గతేడాది సెప్టెంబర్ నెలలో లెనోవో నుంచి కె8 ప్లస్, కె8 స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. తరువాత మళ్లీ ఆ కంపెనీ నుంచి ఫోన్లు రాలేదు. అయితే ఈ నెల 16వ తేదీన భారత్‌లో లెనోవో ఓ కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఓ పోస్టర్‌లో టీజర్ ద్వారా లెనోవో తెలియజేసింది. ఇక కొత్త ఫోన్‌కు గాను కిల్లర్ నోట్ అని పేరు పెట్టినట్లు సమాచారం. గతేడాది ఆగస్టులో కె8 నోట్ విడుదల కాగా దానికి సీక్వెల్ సిరీస్‌లో ఈ కిల్లర్ నోట్ ఫోన్‌ను విడుదల చేయాలని లెనోవో భావిస్తుందని సమాచారం.



లెనోవో తన కొత్త ఫోన్‌కు చెందిన పలు ఇమేజ్‌లను కూడా బయటకు విడుదల చేసింది. ఈ ఇమేజ్‌లను బట్టి చూస్తే కొత్త ఫోన్ మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. రౌండెడ్ కార్నర్లు దానికి ఉన్నాయి. కాగ లెనోవో జడ్5 పేరిట ఇటీవలే చైనాలో ఓ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే అదే ఫోన్‌కు పేరు మార్చి భారత్‌లో విడుదల చేయవచ్చని తెలిసింది. ఇక ఈ ఫోన్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.


NEA (NEWS, ENTERTAINMENT AND ADS)

లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్‌, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


No comments:

Post a Comment