యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ స్పెషల్ న్యూస్ కూడా చెప్పడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 23న ఒక ప్రత్యేకమై విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చెబుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని ప్రభాస్ పేర్కొన్నారు.
23న ప్రభాస్ 39వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. పుట్టినరోజు కాబట్టి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'సాహో' సినిమాకు సంబందించిన ట్రైలర్ లేదా మేకింగ్ వీడియో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వేలాదిగా రియాక్ట్ అయిన ఫ్యాన్స్
ప్రభాస్ చేసిన ఈ పోస్టుపై అభిమానులు భారీ సంఖ్యలో రియాక్ట్ అయ్యారు. తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆ స్పెషల్ న్యూస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ రిప్లై ఇచ్చారు.
ఆ విషయం అయుంటుందని మరికొందరి ఆశ
అయితే ప్రభాస్ తన పోస్టులో సాహో సినిమాకు సంబంధించిన విషయం అని ఏమీ ప్రకటించలేదు. దీంతో ఆ స్పెషల్ న్యూస్ ప్రభాస్ పెళ్లికి సంబంధించిన న్యూస్ కూడా అయుండొచ్చు అని మరికొందరి భావిస్తున్నారు.
గతంలో రకరకాల వార్తలు
గతంలో ప్రభాస్ పెళ్లి విషయంలో రకరకాల ప్రచారం జరిగింది. ప్రభాస్-అనుష్క పెళ్లాడబోతున్నట్లు కూడా జాతీయ మీడియాలో సైతం వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ఖండించారు. మరి ఇపుడు ప్రభాస్ చెప్పబోయే ఆ విషయం ఏమిటో తెలియాలంటే అక్టోబర్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.
సాహో
‘సాహో' సినిమా విషయానికొస్తే... ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఇండియాలో అతిపెద్ద యాక్షన్ ఎంటర్టెనర్‌గా రూపొందిస్తున్నారు. శ్రద్దా కపూర్ హీరోయిన్. 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
YOUTUBE
https://www.youtube.com/channel/UCq5CSd0qTBJsCzTQRdwbc6w?view_as=subscriber
No comments:
Post a Comment