ప్రపంచం మొత్తం మీద ప్రతి ఏటా దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.అందులోను భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలు ఉండవచ్చని అంచనా మన దేశంలో మొత్తం దాదాపు 250 జాతుల పాములున్నాయి.కానీ వాటిలో విష సర్పాలు 52 ఉన్నాయి. ఇక మన ప్రాంతానికి వస్తే మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్నవట.మనిషిని అవి కరిస్తే మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి చనిపోతాడు.ఇక ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల టైంలోనే చేయాలి, ఒకవేళ చేయలేదో పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు.
మనిషిని కరిచిన పాము మామూళుదా, విషపుదా అని తెలియాలంటే అది కరిచిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే మాత్రం కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.ఇంకా చెప్పాలంటే విషపు పాము కరిస్తే కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళ్లి అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు వెళ్తుంది. ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది కనుక ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు ఏ మాత్రం లేవట.
విషపు పాము కరిచిందని గుర్తిస్తే వెంటనే కాటు కు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కాని గుడ్డతో కాని కట్టాలి. ఇంకా అందుబాటులో ఉండే సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని వెనక్కు లాగాలి.మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో వస్తుంది అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం ఇదేవిధంగా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేసిన వెంటనే మనిషి సృహలోకి వస్తాడు.
నిజానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే ఉంటుంది.ఇంకో ముఖ్యమైన సూచన ప్రతి ఒక్కరి ఇంటిలో హోమియోపతి మెడిసిన్ అయినటువంటి నాజా-200 5ML బాటిల్ ను ఉంచుకోవాలి దీని ఖరీదు కేవలం 5 నుండి 10 రూపాయలే ఉంటుంది.దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిముషాలకు ఒక సారి లెక్కన 3 సార్లు వేస్తే పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకునేందుకు ఇది ఉపయోగపడుతుందట. ఇక వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆ పాము కరిచిన వ్యక్తి మనకు ప్రాణాలతో తిరిగివస్తాడట.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER--> https://manatrips.blogspot.com/
YOUTUBE-->https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
No comments:
Post a Comment