Friday, October 5, 2018

ఈ దసరా కోసం 10 బెస్ట్ ఫోన్‌లు (రూ.6,000 నుంచి రూ.20,000లోపు)

దసరా నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లను సిద్థం చేసాయి. ఈ పండుగ సీజన్‌లో భాగంగా మీరు కూడా ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ సూచించబోతోన్న 10 ఫోన్స్ భారీ డిస్కౌంట్ల పై లభ్యంకాబోతున్నాయి. వాటి వివరాలు మీ కోసం..


షియోమి రెడ్‌మి 6ఏ (Xiaomi Redmi 6A)

మీరు రూ.6000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Redmi 6A మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. రూ.5,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోన్న ఈ ఎంట్రీలెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో 18:9 వైడ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, స్టాండర్డ్ బ్యాటరీ, యవరేజ్ క్వాలిటీ కెమెరా వంటి స్పెక్స్ ఉన్నాయి. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు జరగబోతోన్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా 10 శాతం అదనపు డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించబోతున్నారు.

See This-->https://www.youtube.com/watch?v=WqjEws8nAO8&t=1s

రియల్‌మీ సీ1 (Realme C1)

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని రూ.7,000 బడ్జెట్‌లో లేటెస్ట్ స్మార్ట్‌‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Realme C1 మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. రూ.6,999 ధర ట్యాగ్‌తో వస్తోన్న ఈ మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లో 19:9 టాప్ నాచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, డ్యుయల్ రేర్ కెమెరా పోర్ట్, 4,230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి బెస్ట్ క్వాలిటీ ఫీచర్స్ ఉన్నాయి. అక్టోబర్ 11 నుంచి 15 వరకు జరగబోతోన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డిఎఫ్‌సీ కార్డ్స్‌తో కొనుగోలు చేసినట్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది.

రియల్‌మీ 2 (Realme 2)

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని రూ.9,000 బడ్జెట్‌లో లేటెస్ట్ స్మార్ట్‌‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Realme 2 మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. రూ.8,999 ధర ట్యాగ్‌తో వస్తోన్న ఈ మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నాట్చ్ ఫుల్ స్ర్కీన్, స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ రేర్ కెమెరా పోర్ట్, 4,230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డిఎఫ్‌సీ కార్డ్స్‌తో కొనుగోలు చేసినట్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎమ్1 ప్రో (Asus Zenfone Max M1 Pro)



ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని రూ.11,000 బడ్జెట్‌లో లేటెస్ట్ స్మార్ట్‌‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Asus Zenfone Max M1 Pro మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. రూ.10,999 ధర ట్యాగ్‌తో వస్తోన్న ఈ మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ రేర్ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి క్వాలిటీ స్పెక్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డిఎఫ్‌సీ కార్డ్స్‌తో కొనుగోలు చేసినట్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ మీకు లభిస్తుంది.

రియల్‌మి 2 ప్రో (Realme 2 Pro)


ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని రూ.15,000 బడ్జెట్‌లో లేటెస్ట్ స్మార్ట్‌‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Realme 2 Pro మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 సాక్‌ పై రన్ అవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్ డ్రాప్ తరహా నాట్చ్ డిస్‌ప్లేతో పాటు 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి క్వాలిటీ స్పెక్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డిఎఫ్‌సీ కార్డ్స్‌తో కొనుగోలు చేసినట్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ మీకు లభిస్తుంది.

రెడ్‌మి నోట్ 5 ప్రో (Redmi Note 5 Pro)


రూ.15,000 బడ్జెట్‌లో లేటెస్ట్ స్మార్ట్‌‌ఫోన్ కోసం చూస్తోన్న వారికి రెడ్‌మి నోట్ 5 ప్రో మరో ఆప్షన్ అని చెప్పొచ్చు. టాప్ క్వాలిటీ కెమెరా స్పెక్స్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18:9 వైడ్‌ స్ర్కీన్ డిస్‌ప్లే,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 సాక్, MIUI 10 ఆపరేటింగ్ సిస్టం, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి టాప్ క్వాలిటీ స్పెక్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డిఎఫ్‌సీ కార్డ్స్‌తో కొనుగోలు చేసినట్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ మీకు లభిస్తుంది.

నోకియా 6.1 ప్లస్ (Nokia 6.1 Plus)


రూ.16,000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Nokia 6.1 Plus, మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డిఎఫ్‌సీ కార్డ్స్‌తో కొనుగోలు చేసినట్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ మీకు లభిస్తుంది. ఈ ప్రీమియమ్ రేంజ్ ఫోన్‌లో 19:9 టాప్ నాట్చ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ, డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ వంటి క్వాలిటీ స్పెక్స్ ఉన్నాయి.

మోటరోలా వన్ పవర్ (Motorola One Power)


రూ.16,000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Motorola One Power మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డిఎఫ్‌సీ కార్డ్స్‌తో కొనుగోలు చేసినట్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ మీకు లభిస్తుంది. మోటరోలా నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌గా మోటరోలా వన్ పవర్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 19:9 డిస్‌ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి.

షియోమి ఎంఐ ఏ2 (Xiaomi Mi A2)


ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని రూ.17,000 బడ్జెట్‌లో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Xiaomi Mi A2 మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా 10 శాతం అదనపు డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించబోతున్నారు. ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18:9 వైడ్ స్ర్కీన్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 64జీబి స్టోరేజ్, డ్యుయల్ కెమెరా సెటప్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి క్వాలిటీ స్పెక్స్ ఉన్నాయి.

హానర్ ప్లే (Honor Play)


ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని రూ.20,000 బడ్జెట్‌లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Honor Play మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా 10 శాతం అదనపు డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించబోతున్నారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, హైసిలికాన్ కైరిన్ 970 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి క్వాలిటీ స్పెక్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.



లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్‌, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


No comments:

Post a Comment