రష్మీ గౌతమ్.. గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తన అందచెందాలు, అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందాలతో హోయలొలికే ఈ భామ ఈ మధ్య బొద్దుగా కనిపిస్తోంది. ఎందుకిలా బొద్దుగా ఉన్నారని ఓ వీరాభిమాని అడిగిన ప్రశ్నతో ఆమె లావు కావడానికి గల కారణాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అసలు ఈ జబర్దస్త్ భామ బొద్దుగా కనిపించడానికి కారణాలేంటి..? రష్మీ బాల్యం నుంచే అరుదైన వ్యాధితో బాధపడుతోందా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల ట్విట్టర్‌లో తన అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు రష్మీ సమాధానాలిచ్చింది. ముందుగా వీరాభిమాని, రష్మీ మధ్య ట్విట్టర్‌లో జరిగిన సంభాషణ ఇరువురి మాట్లలోనే...!!
వీరాభిమాని ట్వీట్ ఇదీ...
" రష్మీగారు.. ఇటీవల మిమ్మల్ని ఓ ఈవెంట్‌లో చీరలో కనిపించారు. అందులో మీరు చాలా లావుగా కనిపిస్తున్నారు. మీరు మూడు పదుల వయసున్నట్లున్నారు. కాబట్టి శరీరాకృతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వయసులో ఉన్న హీరోయిన్లు కాజల్ అగర్వాల్, సమంత, సోనాల్ చౌహాన్, ఇషా గుప్తా, చాలా స్లిమ్‌గా బాడీని మెయింటెన్ చేస్తున్నారు. మీరు కూడా కాస్త మీ బాడీపై శ్రద్ధపెట్టండి. లేకపోతే కెరీర్‌కు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. మీ కెరీర్ త్వరగా ముగిస్తే భరించలేము. నేను చెప్పే విషయాలను మీరు పరిగణనలోకి తీసుకోండి. నేను చెప్పే మాటలు మిమ్మల్ని హర్ట్ చేయవచ్చు. ఒక వేళ మీరు ఫీలయ్యింటే అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను" అని రష్మీ ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
రష్మీ రెస్పాన్స్ ఇదీ..
" మీరు సూచించిన ప్రకారమే నేను ఎప్పట్నుంచే ఆహారపు అలవాట్లు, ఆహారం తీసుకునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా బరువుకు కారణం ‘రుమాటిజం’. నాకు ఈ వ్యాధి ఉందని 12ఏళ్ల వయసున్నప్పుడు తెలిసింది. దీంతో లావు విషయంలో కొన్ని హెచ్చు తగ్గులుంటాయి. ఇందుకు తగ్గ జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఒత్తిడి పెంచి, కాసింత డిప్రెషన్‌కు గురిచేస్తాయి. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి చాలా మంది తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. దుష్పరిణామాలు కనిపించాయి. నాకు అలాంటి పరిణామాలు ఎదురైతే గౌరవంగా తప్పుకుంటాను" అని రష్మీ తన అభిమానులు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.
రష్మీ రెస్పాన్స్‌ను చూసిన కొందరు నెటిజన్లు చాలా ఫీలయ్యారు. అయ్యో.. అవునా మేడం జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులు మరికొందరు సూచించారు. మీరు నిజంగానే చాలా ధైర్యవంతులు మేడం.. ఇంత బాధను దిగమింగుకుని స్క్రీన్‌పైన కనిపించి అభిమానులను అలరిస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్ టేక్ కేర్ రష్మీగారు అంటూ పలువురు వీరాభిమానులు ఆమెను మెచ్చుకున్నారు.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం...
No comments:
Post a Comment