గిరిజనులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవచేయడానికి జన సైనికులు కట్టుబడి ఉన్నామని జనసేన జిల్లా అధ్యక్షుడు లోకం ప్రసాద్ అన్నారు. మంగళవారం మండంలోని లోవముఠా ప్రాంతమైన గొయిపాక గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జనసేన పార్టీ మైదాన ప్రాంతంలోనే కాకుండా గిరిజన ప్రాంతంలో కూడా పనిచేసి గిరిజనులకు సేవ చేస్తామని, దీనికి తమ పార్టీ అధిష్ఠానం కట్టుబడి ఉందన్నారు. మండలంలోని లోవముఠా ప్రాంతంలో గొయిపాక, బీరుపాడు, చినగీసాడ పంచాయతీల్లోని 480 మంది ప్రజలు వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు బాబు పాలూరు, గౌరీశంకర్, జిల్లా కార్యదర్శి కడ్రక మల్లేష్, మండల కో-ఆర్డినేటర్ తారక్, తదితరులు పాల్గొన్నారు.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER https://manatrips.blogspot.com/
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
No comments:
Post a Comment