Wednesday, October 17, 2018

ఆశించిన ఫలితం దక్కలేదు

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’ భారీ వసూళ్లతో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రంతో తారక్ డబుల్ హ్యాట్రిక్ కొట్టి దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో నటించిన పూజాహెగ్డే, జగపతిబాబు, నవీన్‌చంద్ర, శత్రులకు మంచి పేరు వచ్చింది. కానీ ఇందులో నటించిన హీరోయిన్ ఈషా రెబ్బాకు మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ భామ పాత్ర మూడు, నాలుగు సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. వాస్తవానికి ఈషాపై ఎక్కువ సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో దర్శకుడు త్రివిక్రమ్… ఈషారెబ్బా ఉన్న సీన్లను ఎడిటింగ్‌లో తొలగించాడట. దీంతో ఈ భామకు అనుకున్నంతగా పేరు రాలేదు. ప్రస్తుతం ఈషా కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ గోపాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంపై ఈషా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతోనైనా ఆమె కన్నడంలో పెద్ద హిట్‌ను అందుకుంటుందా అనేది చూడాలి.



లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER 
https://manatrips.blogspot.com/ 


YOUTUBE
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment