Monday, October 15, 2018

ఆయనను బాధపెట్టడం ఇష్టం లేదు.. అందుకే మౌనం.. అత్తారింటికి దారేది తర్వాత.. త్రివిక్రమ్

అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం అరవింద సమేత.. వీర రాఘవ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజాహెగ్డే జంటగా నిర్మాత చినబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌తో మరోసారి ఎన్టీఆర్‌ను వీర రాఘవగా సరికొత్తగా త్రివిక్రమ్ చూపించబోతున్నారు. మహిళా సాధికారిత ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు త్రివిక్రమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వివరించారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత అంశాలను తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. త్రివిక్రమ్ చెప్పిన విషయాలను ఆయన మాటల్లోనే..


విషాదంలో నుంచి ఎన్టీఆర్..

హరికృష్ణ మరణం తర్వాత చోటుచేసుకొన్న విషాదం నుంచి ఎన్టీఆర్ ఇంకా తేరుకోలేదు. అందుకే ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడకూడదని అనుకొన్నాను. అందుకే ఏం మాట్లాడినా మళ్లీ ఆ అంశం చుట్టే తిరుగుతుందని అనుకొన్నాను. ఆ కారణంగానే నేను ఎక్కువ మాట్లాడలేదు. ఏం మాట్లాడినా వారిని బాధపెట్టడమే అవుతుందని అనుకొన్నాను.

వేసవిలో విడుదల చేద్దామని ప్లాన్

హరికృష్ణ మృతి నేపథ్యంలో సినిమాను వేసవిలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేద్దామని అనుకొన్నాను. కానీ ఎన్టీఆర్ ఫోన్ చేసి మూడు రోజుల తర్వాత బయటకు రావొచ్చని చెప్పారు. నాలుగో రోజు నుంచి షూటింగ్‌కు వస్తున్నాను ఎన్టీఆర్ చెప్పారు. అదే విషయాన్ని నిర్మాత చినబాబుతో కూడా చెప్పమని అన్నారు. పూజా హెగ్డే కాల్షీట్స్ వృథా అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సంకల్పం కారణంగానే ఈ సినిమా దసరాకు విడుదలవుతున్నది.

నాలుగో రోజే షూటింగ్‌కు

అయితే తాను తర్వాత మాట్లాడుదామని చెప్పిన వినకుండా నాలుగోరోజు ఎన్టీఆర్ షూటింగ్‌కు హాజరయ్యారు. హరికృష్ణ మరణం తర్వాత అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ చితికి నిప్పు పెట్టే సీన్ షూట్ చేశాం. ఆ సమయంలో ఎన్టీఆర్ ఉద్వేగానికి గురయ్యాడు.

ఫ్యాక్షన్‌కు ముందు తీవ్రత
టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా సినిమా వస్తున్నది. ఫ్యాక్షన్‌లో భాగంగా దాడులు, గొడవలు జరగడానికి ముందు, జరిగేటప్పుడు చాలా విషయం ఉంటుంది. గొడవ పూర్తయిన తర్వాత తీవ్రత అసలే ఉండదు. ఈ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఓ మహిళకు స్థానం కల్పిస్తే ఏమిటనేది కథలో కీలకపాయింట్. అది ఎన్టీఆర్‌కు కూడా బాగా నచ్చింది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.

అత్తారింటికి దారేది సినిమా తర్వాత
అత్తారింటికి దారేది క్లైమాక్స్ తర్వాత ఎమోషనల్ కంటెంట్‌కు కనెక్ట్ అయ్యానా అంటే ఖచ్చితంగా చెప్పలేను. నా సినిమాలకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత నేనేమీ పట్టించుకోను. సినిమా ఫస్ట్ కాపీ బయటకు వచ్చేంత వరకే నాకు గుర్తుండి పోతుంది. ఆ తర్వాత నేను పట్టించుకోను.


లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.
BLOGGER https://manatrips.blogspot.com/ 
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment