Friday, October 19, 2018

సీఎం కోసం 16 ఖరీదైన కార్లు..!

 పంజాబ్‌ ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వాధికారుల కోసం భారీగా ఖర్చు పెడుతోంది. వారందరి కోసం దాదాపు 400 ఖరీదైన కార్లను కొనుగోలు చేసేందుకు పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కార్ల ధర మొత్తం సుమారు రూ.80కోట్ల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి కోసం 16 లాండ్‌ క్రూజర్‌ కార్లు కొనుగోలు చేయనున్నారు. వాటిలో రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఉంటాయి. ఇక ఆయన సిబ్బంది కోసం 13 మహీంద్రా స్కార్పియో, 14 మారుతి డిజైర్‌/ హోండా అమేజ్‌/ ఎర్టిగా కార్లను కొనుగోలు చేయనున్నారు. ఇక 17 మంది మంత్రులకు టొయోటా ఫార్చ్యునర్‌ లేదా టొయోటా క్రిస్టా కొంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని శాసనసభ్యుల కోసం 97 టొయోటా క్రిస్టా కార్లు కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మంత్రులు టొయోటా కామ్రే వాడుతుండగా, శాసనసభ్యులు టొయోటా ఇన్నోవా ఉపయోగిస్తున్నారు. రాష్ట్రం రూ.1,95,978కోట్ల లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతుంటే.. ఇప్పుడు ఇంత ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం అవసరమా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.


ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER
https://manatrips.blogspot.com/ 


YOUTUBE 
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment