Thursday, October 11, 2018

సౌండ్ లేదేంటి చరణ్!!


కోడిపుంజుల్లా మన హీరోలు బాక్స్ ఆఫీస్ యుద్ధం చేసే సంక్రాంతి ఎంతో దూరం లేదు. సరిగ్గా మూడు నెలలు మాత్రమే ఉంది. అందుకే బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్ లో క్రిష్ అద్భుతమైన ఎత్తుగడలతో హైప్ ని అంతకంతా పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పటి దాకా పదికి పైగానే పోస్టర్లు వదిలిన టీమ్ మొన్న ఏకంగా సీక్వెల్ తో సహా రెండు రిలీజ్ డేట్లను ప్రకటించడంతో నందమూరి అభిమానుల హుషారు మాములుగా లేదు. మెల్లగా పెరుగుతున్న ఆసక్తి ట్రేడ్ ని కూడా ఆకర్షిస్తోంది.

కానీ అదే సమయంలో విడుదల ప్లాన్ చేసి ఆ మేరకు మూడు నెలల క్రితమే ఆర్ సి 12 సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించిన నిర్మాత దానయ్య ఆ తర్వాత మాత్రం ఎలాంటి ప్రమోషన్ చేయటం లేదు. సెట్స్ లో ఉన్నప్పుడు కీలక యూనిట్ సభ్యులు కలుసుకున్న అభిమానులు షేర్ చేసుకున్న ఫోటోలు తప్ప అసలు ఇందులో చరణ్ లుక్ ఎలా ఉంటుందో కూడా అధికారికంగ బయటికి రాలేదు.

సరే జరిగిందేదో జరిగింది పోనీ ఇప్పటికైనా ఏమైనా అప్ డేట్స్ ఇస్తారా అంటే ఆ సూచనలు కనిపించడం లేదు. మొన్నోసారి ఓ అభిమాని అత్యుత్సాహంతో చరణ్ పోస్టర్ కి స్టేట్ రౌడీ అని టైటిల్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది కాస్తా విపరీతంగా వైరల్ అయిపోయి అదే నిజమనుకునే దాకా ప్రచారం జరిగిపోయింది. మెగా ఫాన్స్ ఉత్సుకత ఆ రేంజ్ లో ఉంది మరి. చరణ్ కూడా ట్విట్టర్ లో షూటింగ్ లొకేషన్స్ గురించి చెబుతున్నాడు కానీ అంతకు మించి ఏమి మాట్లాడ్డం లేదు. అభిమానులు ఈ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నారు.

పోటీగా ఉన్న ఎన్టీఆర్ సినిమా అంత జోరుమీదున్నప్పుడు తమది  ఇలా చప్పగా ఉండటం ఏమిటని ట్విట్టర్ లో తమ ఆవేదన చెప్పుకుంటున్నారు. మరి నిర్మాత దానయ్య హీరో చరణ్ దర్శకుడు బోయపాటి శీను దీని గురించి ఎప్పుడు మౌనం వీడుతారో వాళ్లే చెప్పాలి. ఎప్పుడో వేసవిలో వచ్చే సైరాకే టీజర్ వదిలినప్పుడు జనవరిలో పక్కాగా వస్తామని చెప్పిన సినిమాకు కనీసం టైటిల్ అయినా అనౌన్స్ చేయకపోతే ఎలా అనేదే ఫ్యాన్స్ లాజిక్. నిజమే కదా.

లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment