హీరోయిన్లు సినిమాల్లో ఎంత అందంగా ఉంటారో చెప్పక్కర్లేదు. చాలా క్యూట్ గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే పండు వెన్నెల ఎంత అందంగా ఉంటుందో అంతకంటే అందంగా కనిపిస్తారు. ఇది కెమెరా మహిమ కావొచ్చు లేదంటే మేకప్ మహిమ కావొచ్చు. మరి మేకప్ లేకుండా కూడా అలాగే ఉంటారా అంటే.. కొందరు ఉంటారేమో.. కొందర్ని అసలు పోల్చుకోలేము. ఇలాంటి వాటిపై అనేక స్పూఫ్స్ కూడా గతంలో వచ్చాయి.
ఇది వేరే విషయం అనుకోండి. కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ను మీరెప్పుడైనా మేకప్ లేకుండా చూశారా..? అంటే చూడలేదని సమాధానం వస్తుంది. హీరోయిన్లు దాదాపుగా బయటకు వచ్చే తప్పుడు మేకప్ లేకుండా రారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో మనకు తెలియదుకదా. శృతి హాసన్ అప్పుడప్పుడు మేకప్ లేకుండా ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అలాంటి ఫోటో ఒకదాన్ని శృతి షేర్ చేసింది.
అప్పుడే షవర్ బాత్ చేసి వచ్చి సెల్ఫీ తీసుకొని దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒరిజినల్ గా నేను ఎలా ఉన్నానో చూశారా అన్నట్టుగా ఉంది ఆ పోజ్. పర్లేదు. బాగానే ఉంది అంటూ మెసేజ్ లు చేస్తున్నారు సినిమా అభిమానులు.
ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ సౌత్ భామ, తరచుగా మ్యూజిక్ ఆల్బమ్స్ కోసం లండన్ చెక్కేస్తుంటుంది. ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ త్వరలోనే తన ఇటలీ లవర్ ను పెళ్లాడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
NEA (NEWS, ENTERTAINMENT AND ADS)
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
No comments:
Post a Comment