తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామాల్లో మీటింగులు, సభలు పెడుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఓ నిర్మల్ లోని ఓ గ్రామంలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
పబ్లిక్ కంటే రాజకీయ నాయకులే ఎక్కువ ఉన్నారు. సభ సందర్భంగా స్థానిక లీడరు మాట్లాడుతుంటే.. ఓకే ఒక్క వ్యక్తి కుర్చీ వేసుకుని వింటున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాహ్ కాంగ్రెస్ కు సూపర్ రెస్పాన్స్ అంటూ హేళన చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
No comments:
Post a Comment