సినిమా రివ్యూలను ప్రేక్షకులు అభిమానులు ఫాలో కావడం సర్వ సాధారణం. కానీ దుబాయ్ లో ఉండే ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ కం సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సందు చెప్పే రివ్యూలంటే మాత్రం మనోళ్లు తెగ భయపడుతుంటారు. కారణం అతను పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయాలు వెలిబుచ్చడమే కాక అసలు సినిమా చూసాడా లేదా అనే అనుమానం వచ్చేలా చేస్తాడు.
ఇక తాజాగా అరవింద సమేత వీర రాఘవ గురించి పాజిటివ్ గా పెట్టడం తారక్ ఫాన్స్ లో కలకలం రేపుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఆ మధ్య అజ్ఞాతవాసి అద్భుతంగా ఉందని పొగుడుతూ ఏకంగా 4 పైగా రేటింగ్ ఇచ్చి మతి పోగొట్టాడు. అతని మాటని గుడ్డిగా నమ్మిన పవన్ ఫ్యాన్స్ కు మొదటి ఆట పూర్తి కాకముందే గర్వభంగం తప్పలేదు. కాటమరాయడు నా పేరు సూర్యలకు ఇలాగే చెప్పి మోసం చేసాడు.
సరే ఇతగాడి టాలెంట్ ఇక్కడితో ఆగలేదు. బాహుబలి 2 విడుదలైనప్పుడు అసలు బాలేదని ఆడటం కష్టమే అని పెదవి విరిచింది కూడా ఈ మహానుభావుడే. అందుకే ఇతను ఏది చెప్పినా రివర్స్ లో ఫిక్స్ అవుతారు ఫాలోయర్స్. ఇప్పుడు చూస్తే అరవింద సమేత వీర రాఘవ బాగుంది అంటున్నాడు. మరి ఇది అలాగే ఉంటుందా లేక తేడా వస్తుందా అనేది వాళ్ళ టెన్షన్.
అయినా ఉమైర్ సందుని అంత నమ్మాల్సిన అవసరం లేదు. ప్రభాస్ అనుష్కలు పెళ్లి చేసుకుంటారంటూ ఆరు నెలల క్రితం జోస్యం చెప్పిన ఇతను ఆ తర్వాత మళ్ళి ఆ ఊసు ఎత్తితే ఒట్టు. అందుకే ఉమైర్ సంధు ట్వీట్ ని లైట్ తీసుకుంటున్నారు తారక్ ఫాన్స్.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER https://manatrips.blogspot.com/
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
No comments:
Post a Comment