Sunday, October 7, 2018

బాలయ్య కాళ్ళు మొక్కుతున్న నిరుపేద.. ఫోటో వైరల్, మళ్ళీ హాట్ టాపిక్.. కారణం ఇదే!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాకుడు చిత్రం మొదటి భాగంగా, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం రెండవ భాగంగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ కృష్ణ జిల్లా హంసల దీవిలో జరిగుతోంది. పలు వివాదాస్పద సంఘటనలతో బాలయ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజగా బాలయ్య గురించి మరో వార్త బయటకు వచ్చింది.



ఫోటో వైరల్

హంసల దీవిలో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. షూటింగ్ లొకేషన్ లో ఓ నిరుపేద వృద్ధుడు బాలయ్య కాళ్లకు మొక్కుతున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

క్యాన్సర్ వ్యాధితో భాదపడుతూ

ఓ నిరుపేద వృద్ధుడు బాలయ్య వద్దకు వెళ్లి తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాని, సాయం చేయాలని అర్థించాడు. వెంటనే స్పందించిన బాలయ్య బసవతారకం క్యాసర్ ఆసుపత్రికి ఫోన్ చేసి ఆ వృద్ధుడి వివరాలు తెలియజేశాడు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని బాలయ్య ఆదేశించాడు.

సంతోషంతో

బాలయ్య అందించిన సాయంతో ఆ వృద్ధుడు సంతోషంలో మునిగిపోయాడు. వెంటనే బాలయ్య కాళ్లకు మొక్కాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఫ్యాన్స్‌తో గొడవ

ఇటీవల బాలయ్య తెలంగాణాలో పర్యటించిన సందర్భంగా అభిమానులపై చేయి చేసుకున్న వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బాలయ్య అభిమానులే ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు.

లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్‌, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


No comments:

Post a Comment