Sunday, October 7, 2018

చరణ్ మూవీకి పవన్ టైటిల్



  • బోయపాటితో చరణ్ మూవీ
  • కథానాయికగా కైరా అద్వాని
  • కీలకపాత్రలో సీనియర్ హీరో ప్రశాంత్
చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. యాక్షన్ విత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. డిఫరెంట్ లుక్ తో చరణ్ కనిపించే ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'స్టేట్ రౌడీ' అనే టైటిల్ ను పెట్టనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ టైటిల్ తో చిరంజీవి సినిమా ఉండటం వలన, అందరిలో ఆసక్తి పెరిగింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకి 'తమ్ముడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ప్రశాంత్ .. ఆర్యన్ రాజేశ్ లకి తమ్ముడిగా చరణ్ కనిపించనున్నాడు. అందువలన ఈ టైటిల్ పెట్టాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నట్టుగా సమాచారం. పవన్ కల్యాణ్ కెరియర్లో 'తమ్ముడు' చెప్పుకోదగిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి టైటిల్ ను చరణ్ కి వాడటం వలన సినిమా పట్ల మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారట. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

----------------------------------------------------------


లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్‌, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


No comments:

Post a Comment