Sunday, October 7, 2018

అదిరిపోయే ఫీచర్లతో మోటో స్మా‌ర్ట్‌ఫోన్‌..

అమెరికా: తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కమ్యూనికేషన్ కంపెనీ మోటొరొలా సరికొత్త స్మా‌ర్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. కానీ మోటో జీ7 స్మా‌ర్ట్‌ఫోన్‌ విడుదలకు ముందే ఫోటోలు లీకయ్యాయి. మోటో జీ7, మోటో జీ7 ప్లే, మోటో జీ7 ప్లస్, మోటో జీ7 పవర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనేది సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది చివరిలో స్మా‌ర్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరంలో సరికొత్త స్మా‌ర్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది. డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్, ఫింగర్ ప్రింట్ స్కానర్, మోటో జీ7 6.4 అంగుళాల పూర్తి హెచ్ డీ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 660, 4జీబీ ర్యామ్, 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 64జీబీ స్టోరేజ్, 3,500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.

లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment