Monday, October 15, 2018

జగిత్యాలలో టీఆర్‌ఎస్‌కు షాక్‌

 జగిత్యాలలో టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. జగిత్యాల జెడ్పీటీసీ నాగలక్ష్మీ, రాములు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గత నెల సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ అదే రోజు 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టిక్కెట్టు దక్కని వారు వేరే పార్టీలోకి మారిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కొండా సురేఖ, బొడిగె శోభ, మేడ్చల్ నుండి సుధీర్ రెడ్డి లకు తొలి జాబితాలో టిక్కెట్టు దక్కలేదు. తొలి జాబితాలో టిక్కెట్టు దక్కని కారణంగా కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరారు.


కాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పురస్కరించుకొని రాజకీయపార్టీలు తమ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను కేసీఆర్ 105 స్థానాల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇంకా 14 స్థానాలకు గాను అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీ తర్వాత మిగిలిన 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.


ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

BLOGGER https://manatrips.blogspot.com/ 
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment