Tuesday, October 30, 2018

మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా..!



ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ షోయెబ్‌ మాలిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ‘ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని వెల్లడిస్తూ ‘బేబీ మీర్జా మాలిక్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ విషయం తెలీగానే సానియా స్నేహితురాలు, ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘చాలా కాలం తర్వాత ఓ శుభవార్త విన్నాను. కంగ్రాట్స్‌ సానియా, షోయెబ్‌.’ అని ట్వీట్‌ చేశారు. తొలి బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా షోయెబ్‌ మాలిక్‌ ఆనందానికి అవధుల్లేకుండాపోయానని, ఆయన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారని అతని‌ మేనేజర్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 2010లో సానియా, షోయెబ్‌ల వివాహం జరిగింది. బిడ్డ కోసం టెన్నిస్‌కు దూరంగా ఉన్న సానియా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నట్లు గతంలో వెల్లడించారు.


Twitter: https://twitter.com/vanithatv_siva

Blogger: https://manatrips.blogspot.com/

Facebook: https://www.facebook.com/AtoZTeluguMovieNews/

YOUTUBE: https://www.youtube.com/channel/UCq5CSd0qTBJsCzTQRdwbc6w?view_as=subscriber

No comments:

Post a Comment