Saturday, October 6, 2018

అంగన్‌వాడీ కార్యకర్తల భర్తీకి నోటిఫికేషన్ విడుదల



విజయవాడ: విజయవాడలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాలు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిణి ఎస్‌.సువర్ణ (ఐసీడీఎస్‌, ప్రాజెక్టు - 2) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఖాళీగా ఉన్న పోస్టుల జాబితా

అంగన్‌వాడీ కార్యకర్త : పప్పుల మిల్లు కాలువ గట్టు (కేటగిరి - బీసీ-బీ), కేఎల్‌ రావు నగర్‌ - 2 (కేటగిరి ఎస్టీ), గిరిపురం - 3 (కేటగిరి ఎస్సీ), బాలాజీనగర్‌ - 2 (కేటగిరి ఎస్టీ), మొగల్రాజపురం - 3 (కేటగిరి బీసీ-బీ), ఆటోనగర్‌ - 1 (కేటగిరి జనరల్‌), నెహ్రూ నగర్‌ (కేటగిరి జనరల్‌), గుణదల వంతెన (కేటగిరి జనరల్‌), డ్రైవపేట - 1 (కేటగిరి జనరల్‌), లంబాడీపేట (కేటగిరి - జనరల్‌), క్రిస్టియన్‌ పేట (కేటగిరి జనరల్‌).

అంగన్‌వాడీ సహాయకురాలు : కస్తూరిబాయిపేట (కేటగిరి బీసీ-సీ), మొగల్రాజపురం - 5 (కేటగిరి బీసీ-ఏ), రోకళ్లపాలెం - 1 (కేటగిరి బీసీ-బీ), కేఎల్‌ రావు నగర్‌ -2 (కేటగిరి బీసీ-ఏ), మధురానగర్‌ - 2 (కేటగిరి బీసీ-బీ), అరండల్‌ పేట (కేటగిరి జనరల్‌), మారుతీ నగర్‌ (కేటగిరి - జనరల్‌), మాచవరం - 2 (కేటగిరి బీసీ-ఈ), బాడవ పేట (కేటగిరి - బీసీ-ఈ), రాణిగారితోట - 6 (కేటగిరి జనరల్‌), అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థుల దరఖాస్తుపై ఏ ఉద్యోగాలకు, ఏ అంగన్‌వాడీ కేంద్రానికి దరఖాస్తు చేస్తున్నారో స్పష్టంగా రాయాలి.

అర్హతలు: స్థానిక వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. 1 జూలై 2018 నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలలోపు వయస్సు వారు మాత్రమే అర్హులు. అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలి పోస్టులకు 10వ తరగతి ఉతీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు విద్యార్హత, తగిన కుల ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ జతపరిచి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు (పూర్తి పని దినాలలో) కానూరు, చర్చి తరువాత ఉన్న రోడ్డు, ఉమాశంకర్‌ నగర్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గల సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిణి, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ - 2, విజయవాడ, కార్యాలయంలో దరఖాస్తులు వ్యక్తిగతంగా అందజేయాలని ఆమె కోరారు.

NEA (NEWS, ENTERTAINMENT AND ADS)

లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్సమాచారం కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్‌, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం “N E A” యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


No comments:

Post a Comment