ఇప్పుడు సినిమా వాళ్లకు ఈ లీకులు తలనొప్పి ఎక్కువైపోయింది. మొన్న అరవింద సమేత సినిమా కూడా లీకుల భారిన పడింది ఇప్పడూ రామ్ చరణ్ సినిమా కూడా లీకుల భారిన పడింది. ఇటీవల విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ వైజాగ్ చేరుకుంది.
ఈ సందర్భంగా రామ్‌చరణ్, బోయపాటి శ్రీను, నిర్మాత డీవీవీ దానయ్యలు సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సింహాచలం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కప్ప స్తంభానికి ఆలింగనం చేసుకున్నారు. పుజానంతరం ఆలయ అధికారులు స్వామికి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ నటిస్తోంది.
అయితే, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్ల ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో చరణ్ కత్తి పట్టుకుని ఫైట్ చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ లీకులతో చిత్ర యూనిట్ కు లేని పోనీ తలనొప్పులు మొదలవుతున్నాయి. వాటిని అరికట్టాడానికీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఫలితం లేకుండా పోతుంది.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER https://manatrips.blogspot.com/
YOUTUBE https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
No comments:
Post a Comment